చర్చలు విఫలం.. మున్సిపల్ కార్మికుల సమ్మె మరింత ఉధృతం

ప్రభుత్వం కొన్ని అంశాల పట్ల సానుకూలంగా స్పందించినా.. కార్మికుల మనోభావాలకు అనుగుణంగా వారి డిమాండ్లు పరిష్కారం చేసే దిశగా మాత్రం చర్చలు జరగలేదు..

చర్చలు విఫలం.. మున్సిపల్ కార్మికుల సమ్మె మరింత ఉధృతం

AP Municipal Workers Strike

Updated On : January 7, 2024 / 12:10 AM IST

AP Municipal Workers Strike : ఏపీ మున్సిపల్ కార్మిక సంఘాల నేతలతో ప్రభుత్వం జరిపిన చర్చలు మరోసారి విఫలం అయ్యాయి. అమరావతి సచివాలయంలో కార్మిక సంఘాల నాయకులతో మంత్రి బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశం అయ్యారు. 3 గంటల పాటు ఈ చర్చలు జరిగాయి. చర్చలు అసంపూర్ణంగా ముగియలేదని, ప్రధాన అంశాలపై ఎటూ తేల్చలేదని కార్మిక సంఘాల నాయకులు అన్నారు. సమ్మెను మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. హెల్త్ అలవెన్స్ జీతంతో కలిపారని, పర్మినెంట్ అదే విధంగా కాంట్రాక్ట్ వర్కర్ల క్రమబద్దీకరణ, సమాన పనికి సమాన వేతనంపై స్పందించలేదన్నారు. అందుకే, సమ్మెను కొనసాగిస్తామన్నారు కార్మిక సంఘాల నాయకులు.

”చర్చలు విఫలం అయ్యాయి. ప్రభుత్వం కొన్ని అంశాల పట్ల సానుకూలంగా స్పందించినా.. కార్మికుల మనోభావాలకు అనుగుణంగా వారి డిమాండ్లు పరిష్కారం చేసే దిశగా మాత్రం చర్చలు జరగలేదు” అని మున్సిపల్ కార్మిక సంఘం నేత అన్నారు.

Also Read : చంద్రబాబు సంచలనం, కేశినేని నానికి చెక్.. అసలేం జరిగింది? పక్కన పెట్టడానికి కారణాలేంటి?

కాగా.. మున్సిపల్ కార్మిక సంఘాల అన్ని డిమాండ్లనూ అంగీకరించామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. హెల్త్ అలవెన్స్ రూ.6వేలు వేతనంలో కలిపి ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు. హెల్త్ అలవెన్స్ పేరు లేకుండా మొత్తం వేతనంగానే ఇస్తామని చెప్పామని.. పరిహారం మొత్తాన్ని కోర్టు ఉత్తర్వుల ప్రకారం చెల్లిస్తామని తెలిపారు. ప్రమాద పరిహారాన్ని(విధుల్లో మరణించిన వారికి) రూ.5లక్షల నుంచి రూ.7లక్షలకు పెంచామన్నారు. మరికొన్ని డిమాండ్లకూ మంత్రుల కమిటీ అంగీకారం తెలిపిందని మంత్రి బొత్స వెల్లడించారు. మున్సిపల్ కార్మికులు వెంటనే విధుల్లో చేరాలని ఆయన కోరారు.

Also Read : వైసీపీలో టికెట్ల రచ్చ.. గుంటూరు, నరసరావుపేట విషయంలో ఎడతెగని పంచాయితీ