AP Covid 3rd Wave : కరోనా థర్డ్ వేవ్‌పై ఏపీ సర్కార్ అలర్ట్!
ఏపీలో కరోనా థర్డ్ వేవ్‌పై ఏపీ రాష్ట్ర సర్కార్ ముందుస్తు వ్యూహాన్ని సిద్ధంచేస్తోంది. థర్డ్ వేవ్ విషయంలో ప్రభుత్వం అలర్ట్ ప్రకటించింది. థర్డ్ వేవ్ ప్రారంభానికి ముందే మందులు సిద్ధం చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

Ap Govt Alert On Covid Third Wave In State
AP Govt Alert on Covid Third Wave : ఏపీలో కరోనా థర్డ్ వేవ్‌పై ఏపీ రాష్ట్ర సర్కార్ ముందుస్తు వ్యూహాన్ని సిద్ధంచేస్తోంది. థర్డ్ వేవ్ విషయంలో ప్రభుత్వం అలర్ట్ ప్రకటించింది. థర్డ్ వేవ్ ప్రారంభానికి ముందే మందులు సిద్ధం చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 3 పీడియాట్రిక్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు.
చిన్న పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు. అలాగే ప్రైవేటు ఆస్పత్రులను అలర్ట్ చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని ఆస్పత్రుల్లో పీడియాట్రిక్ వార్డ్ ఉండాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.
పిల్లల డాక్టర్లను గుర్తించి వారి సేవలు వినియోగించుకోవాలన్నారు. భవిష్యత్ అవసరాల కోసం ముందే మందులు ఆర్డర్ చేయాలని సీఎం ఆదేశించారు.