వైఎస్సార్ పెన్షన్ కానుక పేరును మార్చేసిన ఏపీ ప్రభుత్వం
రాష్ట్రంలోని 65.39 లక్షల మంది పింఛన్ దారులకు నగదు పెంపుతో నెలకు రూ.2,758 కోట్లు, ఏడాదికి రూ.33,099 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది.

NTR Bharosa scheme
AP CM Chandrababu Naidu : ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. సీఎంగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. గురువారం సాయంత్రం సచివాలయంలోని తన చాంబర్ లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన పలు హామీలపై చంద్రబాబు సంతకాలు చేశారు. వీటిలో సామాజిక భద్రత పెన్షన్ల పెంపు కూడా ఉంది. 2014 -2019 మధ్య టీడీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పేరుతో ఈ పథకాన్ని అమలు చేసింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్ఆర్ పెన్షన్ కానుకగా మార్చేసింది. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకం పేరును ఎన్టీఆర్ భరోసాగా మార్చింది.
Also Read : సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు.. మెగా డీఎస్సీపై తొలి సంతకం
ప్రస్తుతం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, కల్లు గీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, డప్పు కళాకారులు, హిజ్రాలు, హెచ్ ఐవీ బాధితులు, కళాకారులకు ప్రతీనెల రూ.3వేలు పింఛన్ అందుతుంది. చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ఆ పింఛన్ ను రూ.4వేలకు పెంచుతూ దస్త్రంపై గురువారం సంతకం చేశారు. దీంతో ఏప్రిల్ నుంచే పెంపును అమలు చేయనుండటంతో జులై 1న పింఛన్ కింద వీరికి రూ. 7వేలు (జులై1న ఇచ్చే రూ.4వేలు, ఏప్రిల్ నుంచి మూడు నెలలకు రూ వెయ్యి చొప్పున) అందివ్వనున్నారు. దివ్యాంగులకు ప్రస్తుతం రూ.3వేలు అందుతుంది.. జులై నెల నుంచి వారికి రూ. 6వేలు అందివ్వనున్నారు.
Also Read : త్వరలోనే అందరినీ కలుస్తా, 20వ తేదీ తర్వాత పిఠాపురంకి వస్తున్నా- పవన్ కల్యాణ్
రాష్ట్రంలోని 65.39 లక్షల మంది పింఛన్ దారులకు నగదు పెంపుతో నెలకు రూ.2,758 కోట్లు, ఏడాదికి రూ.33,099 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది.