Water Dispute Supreme Court : నీళ్ల పంచాయితీని సుప్రీం పరిష్కరిస్తుందా ?

Water Dispute Supreme Court : నీళ్ల పంచాయితీని సుప్రీం పరిష్కరిస్తుందా ?

Sc

AP Govt  : ఏపీ- తెలంగాణ జలవివాదం సుప్రీంకోర్టుకు చేరింది. ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. నెలరోజులకు పైగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం కొనసాగుతున్నా… కేంద్ర ప్రభుత్వ మాత్రం ప్రేక్షక పాత్ర పోషిస్తూ వస్తోంది. రెండు రాష్ట్రాలు కేంద్రానికి వరుసగా లేఖలు రాసినా ఢిల్లీ నుంచి స్పందన లేదు. ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ వేయడంతో కేంద్రం కూడా స్పందించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

Read More : Pune : భార్యతో కలిసి ఉంటే ఎమ్మెల్యే కాలేవన్న జ్యోతిష్కుడు..ఆ భర్త ఏంచేశాడంటే..

తెలంగాణ ప్రభుత్వ తీరును తప్పుపడుతూ ఏపీ పిటిషన్‌ వేసింది. కృష్ణా నదీజలాలు, నీటి ప్రాజెక్టుల పట్ల తెలంగాణ అనుసరిస్తున్న వైఖరి పట్ల ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏపీ ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తోందని ఏపీ ప్రభుత్వం తన పిటిషన్‌లో పేర్కొంది. కృష్ణా బోర్డును నోటిఫై చేసేలా ఆదేశివ్వాలని కూడా కోరింది.

Read More : Bonalu Celebrations : తెలంగాణ భవన్‌లో ఘనంగా బోనాల ఉత్సవాలు

శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల రిజర్వాయర్ల పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా నియంత్రణ ఉండాలని కూడా కోరింది. సుప్రీంకోర్టు తెలంగాణతో పాటు కేంద్రానికి కూడా నోటీసులు జారీ చేస్తే.. కేంద్రం తప్పనిసరిగా తన వైఖరి ఏంటో చెప్పాల్సి ఉంటుంది. సుప్రీం కోర్టుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందన్న అంశంపై ఏపీ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వ తీరువల్లే సుప్రీంకు వెళ్లాల్సి వచ్చిందని.. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.