మాజీ సీఎం టార్గెట్‌గా లిక్కర్ లింకులు తేల్చే ప్లాన్..!

ఏ రాష్ట్రంలోనైనా ఓటర్లు అంటే సామాజిక వర్గాల వారీగా ఉంటారు. కానీ ఏపీలో అందుకు భిన్నంగా మారింది సీన్.

మాజీ సీఎం టార్గెట్‌గా లిక్కర్ లింకులు తేల్చే ప్లాన్..!

Chandrababu-Jagan

Updated On : October 23, 2024 / 8:45 PM IST

తప్పు చేసినోళ్లను వదిలిపెట్టేదు లేదు. అలాగని కక్ష సాధింపు అసలే కాదు. ఇదే ట్యాగ్‌లైన్‌తో అపోజిషన్‌ను టార్గెట్ చేస్తోంది ఏపీ సర్కార్. అరాచకం, అడ్డగోలు నిర్ణయాలు తీసుకుని దోచుకున్నారని ఆరోపణలు చేసిన కూటమి నేతలు ఇప్పుడు బండారం బయటికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇప్పటికే లిక్కర్, స్యాండ్, మైనింగ్‌ మీద ఫోకస్‌ పెట్టిన ప్రభుత్వం.. లిక్కర్ లింకులు తేల్చే పనిలో పడింది. డిస్టిలరీస్ మీద వరుసపెట్టి సీఐడీ రైడ్స్‌ చూస్తుంటే.. పెద్ద డొంక కదిలించే ప్లాన్ జరుగుతోందని అర్థమవుతోంది. జగన్‌ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం మూలాల్ని బయటికి తీసే పనిలో పడింది CID. తనిఖీల్లో గత ఐదేళ్లలో జరిగిన అక్రమాలపై కీలక ఆధారాలు దొరికినట్లు తెలుస్తోంది.

వైసీపీ పెద్ద నేతలు కొన్ని డిస్టిలరీలను అనధికారికంగా కబ్జా చేశారన్న ఆరోపణలున్నాయి. కొత్త బ్రాండ్ల పేరుతో లిక్కర్ ఉత్పత్తి చేసినట్లు కూడా ప్రచారం ఉంది. వీన్నటింటిపై సీఐడీ ఆధారాలు సేకరిస్తుంది. లెక్కలు, రికార్డుల్లో చూపించకుండా మద్యం ఉత్పత్తి చేసి తరలించినట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. డిస్టిలరీల వాస్తవ ఉత్పత్తి సామర్థ్యం ఎంత?

విస్తృతంగా తనిఖీలు
ఎంత వరకు ఉత్పత్తి చేశారనే లెక్కలు బయటికి తీస్తున్నారు. విద్యుత్‌ యూసేజ్‌ ఆధారంగా అక్రమాలపై ఓ అంచనాకు వచ్చే ప్రయత్నం చేస్తోంది సీఐడీ. డిస్టిలరీల్లోని గత ఐదేళ్ల రికార్డులు, హార్డ్‌డిస్క్‌లను సీజ్‌ చేసినట్లు తెలుస్తోంది. వైసీపీ నేతలు విజయసాయి, మిథున్‌రెడ్డి దగ్గరివాళ్ల ఆధీనంలో ఉన్నాయని ఆరోపణలున్న డిస్టిలరీస్‌లో సీఐడీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేశారు. కొన్ని డిస్టిలరీస్‌ను సబ్‌లీజుకు తీసుకుని కొత్త బ్రాండ్లు తయారు చేసినట్లు సీఐడీ గుర్తించినట్లు టాక్.

డిస్టిలరీస్‌లో ఉత్పత్తికి, అమ్మకాలకు మధ్య తేడా గుర్తించినట్లు తెలుస్తోంది. డిస్టిలరీల నుంచి బేవరేజెస్‌ కార్పొరేషన్‌కు ఎంత మొత్తంలో మద్యం సప్లై అయింది.? ఎన్నికల టైమ్‌లో అనధికారికంగా ఎవరెవరికి చేరిందనే లెక్కలను సీఐడీ అధికారులు బయటికి తీస్తున్నారు. మద్యం తయారీలో నిబంధనల ప్రకారం నాణ్యత పాటించారా.? లేదా.?

అనేదానిపై కూడా వివరాలు సేకరిస్తున్నారు. అయితే వైసీపీ హయాంలో ఐదేళ్లలో భారీ మద్యం కుంభకోణం జరిగిందన్న ఆరోపణలున్నాయి. నాసిరకం మద్యాన్ని కూడా ఎక్కువ ధరకు అమ్మారని..వైన్‌ షాపుల నుంచి వచ్చిన సొమ్ముకు లెక్కలు ఉండకుండా.. డిజిటల్‌ పేమెంటును కూడా అనుమతించలేదన్న అలిగేషన్స్ ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఈ కుంభకోణాన్ని బయటకు తీసే బాధ్యతలను సీఐడీకి అప్పగించింది. దీంతో సీఐడీ అధికారులు విజయవాడలోని ఏపీ స్టేట్‌ బేవరేజెస్‌ కార్పొరేషన్‌లో తనిఖీలు చేసి రికార్డులు, ఫైళ్లు, కంప్యూటర్‌ హార్డ్‌ డిస్క్‌లు సీజ్‌ చేశారు. వాటి ఆధారంగా పూర్తి వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు.

జగన్‌ టార్గెట్‌గా ఉచ్చుబిగించేలా?
లిక్కర్ కుంభకోణంలో జగన్‌ కోటరీదే కీరోల్‌ అని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటివరకు దొరికిన ఆధారాలు కూడా అందుకు బలం చేకూరుస్తున్నట్లు తెలుస్తోంది. తన చుట్టూ ఉన్న నాయకులను సంతృప్తి పరిచేందుకు మాజీ సీఎం జగన్ హయాంలో.. అడ్డదారిలో డిస్టిలరీస్‌లను కబ్జా పెట్టి..కొత్త కొత్త బ్రాండ్లు తెచ్చి..క్వాలిటీ లేని మందు అమ్మి అడ్డగోలుగా దోచుకున్నారని కూటమి సర్కార్ ఆరోపిస్తుంది.

అయితే జగన్‌ టార్గెట్‌గానే ఉచ్చుబిగించేలా సీఐడీ సోదాలు అవుతున్నట్లు చర్చ జరుగుతోంది. వైసీపీ పెద్ద నాయకులు ఉన్నారనే దానికంటే దీనంతటికీ జగనే సూత్రధారని..ఆయన పాత్రను తేలిస్తే అన్ని లింకులు బయటపడుతాయని కూటమి ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే సీఐడీకి అప్పగించి అన్ని వివరాలు సేకరిస్తోంది.

అయితే ఏ రాష్ట్రంలోనైనా ఓటర్లు అంటే సామాజిక వర్గాల వారీగా ఉంటారు. కానీ ఏపీలో అందుకు భిన్నంగా మారింది సీన్. మందుబాబుల ఓటు బ్యాంకు అంటూ సెపరేట్‌ వింగ్ అయిపోయింది. వైసీపీ ఓడిపోవడానికి మద్యం ప్రియులు అసంతృప్తి కూడా ఓ కారణమన్న ఎనాలిసిస్‌లు ఉన్నాయి. టీడీపీ అధికారంలోకి రావడానికి కూడా మందుబాబులు కూడా ఓ కారణమంటున్నారు ఎనలిస్టులు. తక్కువ రేటుకు మంచి మద్యం అందిస్తామన్న చంద్రబాబు హామీకి మద్దతు తెలిపారన్న చర్చ కూడా ఉంది. ఇప్పుడదే మందుబాబులను ఇంకా దగ్గర చేసుకునేందుకు కూటమి సర్కార్ ప్లాన్ చేస్తోంది. మందు తయారీలో జరిగిన అక్రమాలను బయటపెట్టేందుకు రెడీ సీఐడీని రంగంలోకి దించింది.

మోదీ, జిన్‌పింగ్‌ భేటీ వేళ.. 2019 నుంచి భారత్‌, చైనా మధ్య ఎలాంటి సమస్యలు ఉన్నాయో చూద్దామా?