Govt Teachers Transfers : ఏపీలో ప్రభుత్వ టీచర్ల ప్రమోషన్లు, బదిలీలకు రోడ్ మ్యాప్..

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ టీచర్ల ప్రమోషన్లు, బదిలీలకు సంబంధించిన రోడ్ మ్యాప్ ను ఏపీ విద్యాశాఖ రిలీజ్ చేసింది.

Govt Teachers Transfers : ఏపీలో ప్రభుత్వ టీచర్ల ప్రమోషన్లు, బదిలీలకు రోడ్ మ్యాప్..

Updated On : December 1, 2024 / 6:09 PM IST

Govt Teachers Transfers : ఏపీలో ప్రభుత్వ టీచర్ల ప్రమోషన్లు, బదిలీలకు సన్నాహాలు చేస్తున్నారు. బదిలీలకు సంబంధించి విద్యాశాఖ రోడ్ మ్యాప్ విడుదల చేసింది. డిసెంబర్ 25, జనవరి 25, ఫిబ్రవరి 10న టీచర్ల ప్రొఫైల్ అప్ డేషన్ ఉంటుందని తెలిపారు. ఫిబ్రవరి 15, మార్చి 1, మార్చి 15 తేదీల్లో సీనియారిటీ జాబితాను రిలీజ్ చేయనున్నారు. ఏప్రిల్ 10 నుంచి 15వ తేదీ వరకు హెడ్ మాస్టర్ల బదిలీలు, 21 నుంచి 25 మధ్య సీనియర్ అసిస్టెంట్ల ట్రాన్స్ ఫర్స్ జరుగుతాయని చెప్పారు. మే 1 నుంచి 10 వరకు సెకండరీ గ్రేడ్ టీచర్ల బదిలీలు పూర్తి చేస్తామని తెలిపారు. మరోవైపు ఏప్రిల్ 16 నుంచి 20 వరకు హెడ్ మాస్టర్లు, మే 26 నుంచి 30 వరకు సీనియర్ అసిస్టెంట్లకు ప్రమోషన్లు కల్పిస్తారు.

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ టీచర్ల ప్రమోషన్లు, బదిలీలకు సంబంధించిన రోడ్ మ్యాప్ ను ఏపీ విద్యాశాఖ రిలీజ్ చేసింది. ఈ నెల 25వ తేదీ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఏప్రిల్ 26, 30వ తేదీల వరకు ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియ ఉంటుంది. జీవో 117కు సంబంధించిన వ్యవహారంలో ఇంకా ప్రభుత్వం ఎటూ తేల్చలేదు. ఆ జీవోను రద్దు చేయాలని ప్రభుత్వం ఇది వరకే నిర్ణయం తీసుకోవడం జరిగింది.

జీవో 117 ప్రకారం మూడు, నాలుగు, ఐదు తరగతులను హైస్కూల్స్ లో మెర్జ్ చేయడం జరిగిందో.. ఆ ప్రక్రియను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దానికి సంబంధించిన ప్రక్రియ పూర్తి స్థాయిలో రద్దైన తర్వాత ఎన్ని పోస్టులు ఖాళీ అవుతాయో తెలుస్తుంది. గతంలో మెర్జ్ చేసిన స్కూళ్లను తిరిగి పునరుద్ధరించాలా లేక వాటిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనేదానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ ప్రక్రియ అంతా పూర్తైన తర్వాత ప్రమోషన్లు, బదిలీలకు సంబంధించి ఒక స్పష్టత వస్తుందని చెప్పొచ్చు.

 

Also Read : దటీజ్ పవన్ కల్యాణ్..! ఢిల్లీ నుంచి గల్లీ వరకు సేనాని దూకుడు, దేశం కళ్లన్నీ పవన్ వైపే..!