Commissioners Transfers : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు బదిలీ

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్పొరేషనల్లో కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లను బదిలీ చేసింది.

Commissioners Transfers : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు బదిలీ

Commissioners Transers

Updated On : June 15, 2021 / 4:20 PM IST

Commissioners Transfers In Andhra Pradesh : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్పొరేషనల్లో కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లను బదిలీ చేసింది. గ్రేటర్‌ విశాఖ కార్పొరేషన్‌ కేంద్రంగా ఈ బదిలీలు చేయడం విశేషం. జీవీఎంసీ పరిధిలో వివిధ హోదాల్లో మార్పులు చేర్పులు చేసింది ప్రభుత్వం. జీవీఎంసీ డిప్యూటీ కమిషనర్‌గా నల్లనయ్యను నియమించిన సర్కార్… జీవీఎంసీ జోనల్‌ కమిషనర్‌గా వెంకట రమణను నియమించింది. అలాగే జీవీఎంసీ డీపీఓలుగా రమేష్‌ కుమార్‌, ఫణి రామ్‌ లను నియమించింది.

జీవీఎంసీ జోనల్‌ కమిషనర్‌ పి. సింహాచలాన్ని పట్టణాభివృద్ది శాఖ కమిషనర్‌ కార్యాలయంలో రిపోర్ట్‌ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. జీవీఎంసీ జోనల్‌ కమిషనర్ శ్రీరామ్‌ మూర్తి సొంత శాఖకు బదిలీ కాగా… జీవీఎంసీ జోనల్‌ కమిషనర్‌ సీహెచ్‌ గోవింద రావును మాతృస్థానానికి బదిలీ అయ్యారు. గ్రామ, వార్డు సచివాలయాల శాఖ కమిషనర్‌ కార్యాలయానికి ఎన్‌ మల్లికార్జున్‌ బదిలీ కాగా… శ్రీకాకుళం మున్సిపల్‌ కమిషనర్‌గా ఓబులేసును నియమించింది సర్కార్. విశాఖకు రాజధాని తరలిస్తారనే ప్రచారం జోరుగా జరుగుతున్న సందర్భంలో జీవీఎంసీ కేంద్రంగా జరిగిన బదిలీల అంశం ప్రాధాన్యత సంతరించుకుంది.