మాపైనే కామెంట్ చేస్తారా? ఏపీ హైకోర్టు ఆగ్రహం.. 49 మందికి ధిక్కరణ నోటీసులు 

  • Published By: srihari ,Published On : May 26, 2020 / 01:03 PM IST
మాపైనే కామెంట్ చేస్తారా? ఏపీ హైకోర్టు ఆగ్రహం.. 49 మందికి ధిక్కరణ నోటీసులు 

Updated On : May 26, 2020 / 1:03 PM IST

అమరావతి : బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేశ్, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జడ్జిలను కించపరుస్తూ సోషల్ మీడియాలో చేసిన పోస్టులపై న్యాయవాది పిల్ దాఖలు చేశారు. న్యాయమూర్తులపై వ్యాఖ్యల అంశాన్ని సుమోటోగా హైకోర్టు తీసుకుంది. వివాదాస్పద వ్యాఖ్యలపై హైకోర్టు విచారణ చేపట్టింది. 49 మందికి ఏపీ హైకోర్టు నోటీసులు జారీచేసింది. 

తదుపరి విచారణ మూడు వారాలకు కోర్టు వాయిదా వేసింది. జడ్జిలు ఇచ్చిన జడ్జిమెంట్లపై సోషల్ మీడియాలో ట్రోల్ చేయడాన్ని కోర్టు తప్పుబట్టింది. పలు పార్టీ నేతలు, కార్యకర్తలు, టిక్ టాక్ యూజర్లు కామెంట్లు చేయడంపై కోర్టు సీరియస్ అయింది. కోర్టు జడ్జిమెంట్లపై వివాదాస్పద కామెంట్లు చేశారో వారికి సంబంధించి సాక్ష్యాధారాలతో లేఖ రూపంలో హైకోర్టులో న్యాయవాది సమర్పించారు. దీన్ని కోర్టు సుమోటోగా స్వీకరించింది. 

ఇలాంటి అనుచిత కామెంట్లతో హైకోర్టు ప్రతిష్ట దెబ్బతింటుందని, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందనే కోర్టులో పిల్ దాఖలు చేశారు. జడ్జిమెంట్లను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులపై న్యాయవాది పిల్ దాఖలు చేశారు. 49 మందికి నోటీసులు జారీ చేసింది కోర్టు. వీరిలో వైసీపీ ఎంపీ నందిగం సురేశ్, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కూడా ఉన్నారు.