AP High Court: ఇద్దరు ఉన్నతాధికారులకు జైలు శిక్ష విధించిన ఏపీ హైకోర్టు
కాగా మంగళవారం జరిగిన విచారణకు ఇద్దరు అధికారులు వ్యక్తిగతంగా హాజరయ్యారు. విచారణ సమయంలో అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్టు.

Ap High Court
AP High Court: ఇద్దరు ఉన్నతాధికారులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారం రోజులపాటు జైలు శిక్ష విధించింది. ఏప్రిల్ నెలలో 36 మంది ఉద్యోగులను రెగ్యులర్ చెయ్యాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. కాగా అధికారులు ఈ ఆదేశాలను అమలు చేయకపోవడంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
కోర్టు ఉత్తర్వులను అమలు చేయాలంటూ పలుమార్లు ఆదేశించినప్పటికి బేఖాతరు చేయడంతో ఐఏఎస్ అధికారి గిరిజా శంకర్, ఐఎఫ్ఎస్ అధికారి చిరంజీవికి కోర్టు వారం రోజుల పాటు జైలు శిక్ష విధించింది. కాగా మంగళవారం జరిగిన విచారణకు ఇద్దరు అధికారులు వ్యక్తిగతంగా హాజరయ్యారు. విచారణ సమయంలో అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్టు.