2 IAS Officers Sentenced: ఇద్దరు ఐఏఎస్‭లకు నెల రోజుల జైలు శిక్ష విధించిన హైకోర్టు

వారిద్దరూ కోర్టు ధిక్కరణ పాల్పడ్డారని తేల్చి చెప్పుతూ ఇద్దరు ఐఏఎస్ లకు జైలు శిక్ష విధించింది. వచ్చే నెల 8లోపు రిజిస్ట్రార్ జ్యుడీషియల్ వద్ద లొంగిపోవాలని ఆ ఇద్దరికి ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

2 IAS Officers Sentenced: ఇద్దరు ఐఏఎస్‭లకు నెల రోజుల జైలు శిక్ష విధించిన హైకోర్టు

Updated On : November 28, 2023 / 8:03 PM IST

ఆంధ్రప్రదేశ్ కేడర్‭కు చెందిన ఇద్దరు ఐఏఎస్‭లకు నెల రోజుల శిక్ష విధిస్తూ ఏపీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. శిక్షతో పాటు వారికి తలా 1000 రూపాయల జరిమానా విధించింది. ఆ ఇద్దరు జే.శ్యామలా రావు, పొలా భాస్కర్. నీరు చెట్టు కార్యక్రమం కింద దాఖలైన పిటిషన్ మీద విచారించిన హైకోర్టు.. వారిద్దరూ కోర్టు ధిక్కరణ పాల్పడ్డారని తేల్చి చెప్పుతూ ఇద్దరు ఐఏఎస్ లకు జైలు శిక్ష విధించింది. వచ్చే నెల 8లోపు రిజిస్ట్రార్ జ్యుడీషియల్ వద్ద లొంగిపోవాలని ఆ ఇద్దరికి ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.