టచ్ చేయవద్దు : చీఫ్ మార్షల్‌కు మండలి ఛైర్మన్ వార్నింగ్

అసెంబ్లీ చీఫ్ మార్షల్స్‌కు మండలి ఛైర్మన్ షరీఫ్ వార్నింగ్ ఇచ్చారు. సభ్యులను టచ్ చేయవద్దని హెచ్చరించారు. ఈ సందర్భంగా మార్షల్స్‌కు రూలింగ్ జారీ చేశారు. మహిళా సభ్యులను మహిళలు, పురుషులను పురుషులే చెక్ చేయాలని రూలింగ్ ఇచ్చారు. సభ్యుల గౌరవానికి భంగం వాటిల్లకుండా..ప్రవర్తించాలని సూచించారు. టీడీపీ సభ్యులంతా ఒక్కసారిగా గేటు లోపలికి రావడంతో..గేటు వేయడం జరిగిందని ఛైర్మన్‌కు చీఫ్ మార్షల్స్ వివరణనిచ్చారు.
మరోసారి సభ్యుల పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తే..ప్రివిలైజ్ పిటిషన్ దాఖలు చేస్తామని టీడీపీ సభ్యులు హెచ్చరించారు. గేటు వద్ద చంద్రబాబు, టీడీపీ సభ్యుల పట్ల..మార్షల్స్ వ్యవహరించిన తీరుపై వీడియో క్లిప్పింగ్‌లను మండలి ఛైర్మన్, మంత్రులకు టీడీపీ సభ్యులు చూపించారు. సభ్యులతో పద్దతిగా వ్యవహరించాలని చీఫ్ మార్షల్స్‌కు మంత్రులు బుగ్గన, పిల్లి సుభాష్ చంద్రబోస్, బోత్స సత్యనారాయణలు సూచించారు.
2019, డిసెంబర్ 12వ తేదీ గురువారం నాడు శీతాకాల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా టీడీపీ సభ్యులు ప్లకార్డులను పట్టుకుని నిరసన తెలిపారు. వీరిని సెక్యూర్టీ సిబ్బంది అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మార్షల్స్ వ్యవహరించిన తీరుపై బాబు ఖండించారు. పరిధి దాటి వ్యవహరిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. సెక్యూర్టీ సిబ్బంది తీరును నిరసిస్తూ..బాబు..టీడీపీ నేతలు అసెంబ్లీ ఎదుట బైఠాయించారు. ప్రతిపక్ష నేత చేయి పట్టుకుని లాగేశారని టీడీపీ సభ్యులు ఆరోపించారు.
Read More : ఏపీ అసెంబ్లీలో జగన్ ఫైర్ : కళ్లు పెద్దదిగా చూస్తే భయపడుతామా