Minister Anil Kumar Yadav : వారికంటే నాలుగు రెట్లు ఎక్కువ తిట్టగలం-మంత్రి అనిల్
తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిల పై చేసిన వ్యాఖ్యల పట్ల ఏపీ మంత్రులు తీవ్రంగా స్పందించారు.

Ap Minister Anil Kumar Comments On Ts Ministers
Minister Anil Kumar Yadav : తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిల పై చేసిన వ్యాఖ్యల పట్ల ఏపీ మంత్రులు తీవ్రంగా స్పందించారు. తెలంగాణ మంత్రులు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని వారికంటే నాలుగింతలు ఎక్కువే తిట్టగలమని నీటి పారుదల శాఖ మంతి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.
ఏపీ ప్రయోజనాల కోసం ఎంతదూరమైనా వెడతామని అనిల్ కుమార్ అన్నారు. తెలంగాణ తీరును తిప్పి కొడతామన్న ఆయన, తెలంగాణ తీరుపై ప్రధాన మంత్రికి లేఖ రాస్తున్నట్లు చెప్పారు. రివర్ బోర్డు వద్దన్నా శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతలలో విద్యుదుత్పత్తి చేస్తున్నారని ఆరోపించారు.
కృష్ణానదిపై ఉన్న అన్ని ప్రాజెక్టులను కేఆర్ఎంబీ పరిధిలోకి తేవాలన్నారు మంత్రి అనిల్ కుమార్. మాకు కేటాయించిన నీటినే మేము వాడుకుంటున్నామని మంత్రి వివరించారు. కేటాయింపులకు లోబడే ఏపీ ప్రాజెక్టులు కడుతోందని ఆయన తెలిపారు. ఇరు రాష్ట్రాల మధ్య సామరస్య ధోరణితోనే సమస్యలు పరిష్కరించుకోటానికి తాము సమన్వయం పాటిస్తున్నామని ఆయన అన్నారు.
సున్నితమైన విషయంలో సమన్వయంతో ఉండాలని సీఎం జగన్ సూచించటంతోనే సమన్వయంతో వ్యవహరిస్తున్నామని ఆయన అన్నారు. కాగా …రాజకీయ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని తెలంగాణ మంత్రులు మాట్లాడుతున్నారని అందుకని ఏపీ మంత్రులు రెచ్చగొట్టేలా మాట్లాడవద్దని సీఎం జగన్ మోహన్ రెడ్డి మంత్రి వర్గ సహచరులకు సూచించినట్లు తెలుస్తోంది.