Kodali Nani : రాజశేఖర్‌రెడ్డి రాక్షసుడు కాదు రక్షకుడు-కొడాలి నాని

దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రాక్షసుడు కాదని....రక్షకుడని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాక్షసుడు అంటూ తెలంగాణకు చెందిన మంత్రులు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.

Kodali Nani : రాజశేఖర్‌రెడ్డి రాక్షసుడు కాదు రక్షకుడు-కొడాలి నాని

Minister Kodali Nani

Kodali Nani : దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రాక్షసుడు కాదని….రక్షకుడని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాక్షసుడు అంటూ తెలంగాణకు చెందిన మంత్రులు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.

ఆయన బ్రతికి ఉంటే రాష్ట్రం ఇలా ఉండేదికాదని….ఈ రాష్ట్రాన్ని ముక్కలు కాకుండా కాపాడినవారు రాజశేఖరరెడ్డి అని వ్యాఖ్యానించారు. ఈరోజు ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడుతూ..ఏ రాష్ట్ర ప్రయోజనాలు ఆ రాష్ట్రానికి వుంటాయి…ఆ రాష్ట్ర ప్రయోజనాలు వారు చూసుకోవాలని హితవు పలికారు.

చంద్రబాబు నాయుడు ఆరు నెలలకు ఓసారి రాష్ట్రానికి వస్తారు… పోతారు అని…. పబ్లిసిటీ కోసం ఏదో ఒక సాధన దీక్ష‌చేసి మరలా వెళ్లిపోతాడని అన్నారు. టీడీపీని తొక్కి బీజేపీ అధికారంలోకి రావాలని చూస్తోందని…బీజేపీని ఏపీలో ఒక పర్సెంటేజ్ కూడా పట్టించుకొనేవారు లేరని తెలిపారు. బీజేపీకి జనసేనతో కలిసి పోటీ చేస్తే ఎన్ని ఓట్లు వచ్చాయో మనం చూశామని ఆయన అన్నారు.

వైఎస్ జగన్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో అందరికీ తెలుసని….బీజీపీ అధికారంలో వున్న‌ రాష్ట్రాలలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో, కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో త్వరలో బయటకు వస్తాయని కొడాలి నాని అన్నారు.