Ap Polycet 2023: ప్రారంభమైన ఏపీ పాలిసెట్ -2023 ప్రవేశ పరీక్ష..
పాలిసెంట్ ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా 87 ప్రభుత్వ, 171 ప్రైయివేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో 29 బ్రాంచ్‌లలో మూడేళ్ల డిప్లొమా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు.

Ap Polycet 2023 Exam
Ap Polycet 2023: ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ 2023 ప్రవేశ పరీక్ష ఏపీ వ్యాప్తంగా ప్రారంభమైంది. ఈ ప్రవేశ పరీక్ష కోసం మొత్తం 61 పట్టణాల్లో 499 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది పాలిసెట్ -2023 ప్రవేశ పరీక్షకు 1,59,144 మంది విద్యార్ధులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 96429 మంది బాలురు, 62715 మంది బాలికలు ఉన్నారు. బాలికల సంఖ్య మొత్తం విద్యార్ధులలో దాదాపు 40శాతం ఉంది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది పాలిసెట్ ప్రవేశ పరీక్ష రాసే విద్యార్థుల సంఖ్య 21,000కు పెరిగింది.
Eamcet Exam: ఎంసెట్ ప్రవేశ పరీక్ష ప్రారంభం.. రెండు సెషన్లలో ఎగ్జామ్స్
ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ప్రవేశ పరీక్ష మధ్యాహ్నం 1 గంటల వరకు జరుగుతుంది. గిరిజన ప్రాంతాలలో చేపట్టిన ప్రత్యేక ప్రచారం ఫలితంగా ఎస్సి విద్యార్థులు 26698 మంది, ఎస్సీ విద్యార్థులు 9113 మంది పరీక్షకు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఉదయం 11గంటలకు పరీక్ష ప్రారంభం అవుతుందని, నిమిషం ఆలస్యం వచ్చినా పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని ఇప్పటికే అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఉదయం 10గంటలకే పాలిసెట్ 2023 ప్రవేశ పరీక్ష రాసే విద్యార్థులు పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకున్నారు.
Karnataka Elections 2023 : ఓటు హక్కు వినియోగించుకున్న ఇన్ఫోసిస్ నారాయణమూర్తి దంపతులు
పాలిసెంట్ ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా 87 ప్రభుత్వ, 171 ప్రైయివేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో 29 బ్రాంచ్ లలో మూడేళ్ల డిప్లొమా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తామని ఏపీ ప్రభుత్వం తెలిపింది. కమిషనర్ చందలవాడ నాగరాణి మాట్లాడుతూ.. ఈ ఏడాది కొత్తగా మరో మూడు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలు ఫ్రారంభిస్తామని చెప్పారు.