AP Politics : బందరు వైసీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు..పేర్ని నాని Vs ఎంపీ బాలశౌరీ

కృష్ణా జిల్లా మచిలీపట్నం వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి.దాడులు, గొడవలతో వైసీపీ నేతలు రోడ్డుకెక్కుతున్నారు. మాజీ మంత్రి పేర్ని నాని, ఎంపీ వల్లభనేని బాలశౌరీకి మధ్యా మాటల తూటాలు పేలుతున్నాయి. ఇద్దరి మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమని మండేటట్లుగా ఉంది.

AP Politics : బందరు వైసీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు..పేర్ని నాని Vs ఎంపీ బాలశౌరీ

Ycp Mp Vallabhaneni Balashowry Sensational Comments On Ex Minister Perni Nani

Updated On : June 11, 2022 / 12:12 PM IST

Machilipatnam YCP Politics  :కృష్ణా జిల్లా మచిలీపట్నం వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి.దాడులు, గొడవలతో వైసీపీ నేతలు రోడ్డుకెక్కుతున్నారు. ప్రధానంగా మాజీ మంత్రి పేర్ని నాని, ఎంపీ వల్లభనేని బాలశౌరీకి అస్సలు ఏమాత్రం పడటం లేదు. సొంత పార్టీ నేతల మధ్యా మాటల తూటాలు పేలుతున్నాయి. ఇద్దరి మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమని మండేటట్లుగా ఉంది. ఈ క్రమంలో నానిపై బాలశౌరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పేర్ని నాని ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోందని.. సొంత నియోజకవర్గంలో ఎంపీకి తిరిగే హక్కు లేదా అని బాలశౌరి ప్రశ్నించారు.

బీజేపీ ఎంపీ సుజనా చౌదరితో కలిసి పేర్ని నాని తిరుగుతున్నారని..సుజానా చౌదరి వైసీపీ ప్రభుత్వాన్ని సీఎం జగన్ ను తిట్టినా పేర్ని ఏమాత్రం పట్టించుకోవట్లేదని ఎంపీ బాలశౌరి ఆరోపిస్తుంటే..పేర్ని నాని మాత్రం బాలశౌరీ
టీడీపీ నేత కొనకళ్లతో అధికార పార్టీ ఎమ్మెల్యే పనేంటీ అని ఎంపీ నిలదీశారు. అలాగే బాలశౌరి కూడా పేర్ని నానిపై ఏమత్రం తగ్గటంలేదు. బందురు నీ అడ్డాకాదు రెచ్చిపోతే చూస్తే ఊరుకునేది లేదంటూ కౌంటర్ ఇస్తున్నారు. పేర్ని నాని ఆగడాలకు అదిరింపులు బెదిరింపులకు భయపడేది లేదన్నారు బాలశౌరి. పేర్ని నాని వ్యవహారంతో వైసీపీ ఏదారి పడుతోందో ప్రజలకే అర్ధం కావడం లేదంటూ బాలశౌరి ఆవేదన వ్యక్తం చేశారు.

రేపటి నుంచి బందరులోనే వుంటానని.. ఎవరేం చేస్తారో చూస్తానంటూ ఎంపీ హెచ్చరించారు. తాటాకు చప్పుళ్లకు, ఊడుత ఊపుళ్లకు భయపడేది లేదని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎంను విమర్శించిన కార్యక్రమంలో పేర్ని నాని ఎందుకు పాల్గొన్నారని బాలశౌరీ ప్రశ్నించారు. సుజనా చౌదరి, పేర్ని నాని ఒకరినొకరు పొగుడుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. పార్టీ కోసం పనిచేసినా బాలశౌరి ప్రాధాన్యతివ్వడం లేదంటూ.. పేర్నినాని అనుచరుడు అజ్గర్‌ వర్గీయులు ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో బాలశౌరి పర్యటనను అజ్గర్‌ వర్గీయులు అడ్డుకున్నారు. బాలశౌరి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. సీఎం జగన్ చెప్పారనే బాలశౌరిని గెలిపించామని .. కానీ తమను ఎంపీ పట్టించుకోవడం లేదంటూ అజ్గర్‌ ఆవేదన వ్యక్తం చేశాడు.