AP New Covid Cases : ఏపీలో కొత్తగా 21,320 కోవిడ్ కేసులు

AP New Covid Cases : ఏపీలో కొత్తగా 21,320 కోవిడ్ కేసులు

Ap New Covid Cases

Updated On : May 18, 2021 / 6:36 PM IST

AP New Covid Cases : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 21,320 మందికి కోవిడ్ నిర్దారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 14,75,372కి చేరింది.

రాష్ట్ర వ్యాప్తంగా నిన్న 91,253 నమూనాలను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. కాగా నిన్న 99 మంది కరోనా వైరస్ కారణంగా మరణించారు.

మొత్తం కరోనా మృతుల సంఖ్య 9,580 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,11,501 క్రియాశీలక కేసులున్నాయని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వివరించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 12,51, 396 మంది కరోనాకు చికిత్స పొంది ఇళ్లకు తిరిగి వెళ్లారు.