AP Corona Cases : ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు

ఏపీలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్త కేసుల సంఖ్య భారీగా తగ్గింది. రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 1,166 కరోనా కేసులు నమోదయ్యాయి.

AP Corona Cases : ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు

Ap Corona Cases

Updated On : February 11, 2022 / 6:31 PM IST

AP Corona Cases : ఏపీలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్త కేసుల సంఖ్య భారీగా తగ్గింది. రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 1,166 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో ఐదుగురు కోవిడ్ తో మరణించారు. అదే సమయంలో 24గంటల వ్యవధిలో రాష్ట్రంలో 9వేల 632మంది కరోనా నుంచి కోలుకున్నారు.

కొవిడ్‌ తో చిత్తూరు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, పశ్చిమగోదావరి జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 32వేల 413 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 23,11,133. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 22,64,032. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 14,688కి పెరిగింది. గడిచిన 24గంటల వ్యవధిలో రాష్ట్రంలో 25వేల 495 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. నేటి వరకు రాష్ట్రంలో 3,27,84,934 కరోనా టెస్టులు చేసినట్లు వైద్యఆరోగ్య శాఖ తెలిపింది.

గడిచిన 24గంటల్లో నమోదైన కేసుల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 256 కరోనా కేసులు వెలుగుచూశాయి. అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 11 కేసులు నమోదయ్యాయి. గురువారంతో(1,345) పోలిస్తే శుక్రవారం కరోనా కేసుల సంఖ్య తగ్గింది.

అటు దేశంలోనూ కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఇటీవల ప్రతిరోజూ లక్షల్లో నమోదైన కేసులు ప్రస్తుతం 60వేలకు దిగువన నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 14లక్షల మందికి కరోనా టెస్టులు చేయగా.. 58,077 మందికి కోవిడ్ నిర్ధారణ అయ్యింది. తాజా కేసులతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 4,25,36,137కి చేరింది. 24 గంటల వ్యవధిలో మరణాలు కూడా భారీగా తగ్గాయి. ముందురోజు 1,200 పైగా మరణాలు నమోదుకాగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 657గా ఉంది. మొత్తం మరణాల సంఖ్య 5,07,177కి పెరిగింది.

అటు తాజాగా దేశవ్యాప్తంగా 1,50,407 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 6,97,802 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 3.89 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో 48,18,867 మందికి కరోనా వ్యాక్సిన్లు వేశారు. ఇప్పటివరకూ 171 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ అయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

దేశంలో కరోనా థర్డ్ వేవ్ ముగింపు దశకు చేరుకుంటోందని నిపుణులు చెబుతున్నారు. స్వల్ప హెచ్చుతగ్గులతో కొత్త కేసులు క్రమంగా అదుపులోకి రావడమే ఇందుకు నిదర్శనం అంటున్నారు. ఈ రెండేళ్ల వ్యవధిలో 4.25 కోట్ల మందికి కరోనా సోకగా.. 5.07 లక్షల మంది చనిపోయారు.