AP Corona Cases : ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే

ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కరోనా కొత్త కేసులు మళ్లీ పెరిగాయి. గతరోజు 100కి లోపే కొత్త కేసులు నమోదవగా, ఈసారి..

AP Corona Cases : ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే

Ap Corona Cases

Updated On : December 28, 2021 / 6:49 PM IST

AP Corona Cases : ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కరోనా కొత్త కేసులు మళ్లీ పెరిగాయి. గతరోజు 100కి లోపే కొత్త కేసులు నమోదవగా, ఈసారి ఆ సంఖ్య వందను దాటింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 30వేల 752 శాంపిల్స్ పరీక్షించగా, 141 మందికి కొవిడ్ పాజటివ్ గా నిర్ధారణ అయ్యింది. కోవిడ్ తో మరో ఇద్దరు చనిపోయారు. విశాఖపట్నం, పశ్చిమ గోదావరిలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.

అదే సమయంలో గడిచిన 24 గంటల్లో 165 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం 1073 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 14వేల 492కి పెరిగింది. ఇప్పటివరకు 20,76,687 కేసులు నమోదవగా 20,61,122 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 3,12,30,356 శాంపిల్స్ పరీక్షించారు.

Vaccination Of Children : సరైన శిక్షణ పొందిన వారితో మాత్రమే పిల్లలకు కోవిడ్ టీకాలు వేయించాలి : కేంద్ర ఆరోగ్యశాఖ

కాగా, కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఒమిక్రాన్ రూపంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. డెల్టా కన్నా వేగంగా వ్యాపిస్తూ భయాందోళనకు గురి చేస్తోంది. మన దేశంలోనూ ఒమిక్రాన్ కలవరం రేపుతోంది. క్రమంగా కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి.

ఒమిక్రాన్ ముప్పు నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనని నిపుణులు తేల్చి చెప్పారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం మస్ట్ అంటున్నారు. అలాగే ప్రతి ఒక్కరూ టీకాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వాలు కూడా పెద్దఎత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమాలు చేపడుతున్నాయి. దాదాపుగా చాలామంది రెండు డోసులు తీసుకున్నారు. ఒమిక్రాన్ ముప్పు నేపథ్యంలో ఇప్పుడు బూస్టర్ డోసు ఇచ్చేందుకు కేంద్రం సన్నద్ధమైంది. మానవాళికి ముప్పుగా మారిన కరోనావైరస్ మహమ్మారి నుంచి కాపాడుకోవాలంటే ఏకైక మార్గం వ్యాక్సిన్ మాత్రమే అని నిపుణులు తేల్చి చెప్పారు.

Oppo A11s : భారీ బ్యాటరీతో ఒప్పో నుంచి కొత్త ఫోన్.. ఫీచర్లు అదుర్స్..!

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రాలకు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. అవసరమైతే కఠిన నిబంధనలు అమలు చేయాలంది.

రానున్న పండుగల నేపథ్యంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని, పండుగల వేళ ఒమిక్రాన్ కట్టడికి రాత్రి కర్ఫ్యూలు అమలు చేయాలని కేంద్రం నిర్దేశించింది. భారీ సభలు, సమూహాలు నియంత్రించాలని స్పష్టం చేసింది. బాధితుల శాంపిల్స్ ను ఆలస్యం చేయకుండా జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపాలని సూచించింది. డెల్టా, ఒమిక్రాన్ కేసులపై తరచుగా పరిశీలన జరపాలని, పాజిటివిటీ, డబ్లింగ్ రేటు ఎక్కువగా ఉన్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలంది.

దేశంలో ఒమిక్రాన్‌ కేసులు నానాటికీ పెరుగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం చేసిన హెచ్చరికలతో పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. నైట్ కర్ఫ్యూ వంటి ఆంక్షలు విధించాయి. అంతేకాదు కర్ఫ్యూ సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడొద్దని ఆంక్షలు పెట్టాయి. 50 శాతం సామర్థ్యంతో థియేటర్లు, హోటళ్లు, జిమ్‌లకు అనుమతిచ్చాయి. వేడుకల్లో 100 మందికి మాత్రమే అనుమతిస్తామని, బహిరంగ వేడుకల్లో అయితే 250 మంది వరకు అనుమతిస్తామని ప్రభుత్వాలు స్పష్టంచేశాయి.