త్యాగదనులకు కీలకపదవులు దక్కేనా? నామినేటెడ్ పదవుల జాతర
మిగిలిన కొద్దిపాటి నామినేటెడ్ పదవులకు హెవీ కాంపిటేషన్ ఏర్పడుతోంది.

AP CM Chandrababu
ఏపీలో నామినేటెడ్ పదవుల జాతర కొనసాగుతోంది. ఇప్పటికే పలు విడతలుగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసిన కూటమి సర్కార్…ఆదివారంనాడు మరికొందరికి నామినేటెడ్ పదవులను కట్టబెట్టింది. ఐతే ఇంకా పదవులు ఆశిస్తున్న వారు చాలా మందే ఉన్నారు. మరి నామినేటెడ్ కొలువులు దక్కని వారికి కూటమి అధినేత చంద్రబాబు ఏవిధంగా న్యాయం చేయబోతున్నారు.
పదవులు ఆశిస్తున్న ఆ మిగిలిన నేతలెవరు? అలాంటి వారికి ఎలాంటి పదవులు దక్కబోతున్నాయి? ఎన్నికల్లో త్యాగదనులకు న్యాయం చేసేందుకు చంద్రబాబు ఎలాంటి వ్యూహాన్ని అమలు చేయబోతున్నారు? ఏపీలో మరోసారి నామినేటెడ్పదవులను కూటమి ప్రభుత్వం భర్తీ చేసింది. తాజాగా 22 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది. ఈ జాబితాలో అమరావతి జాయింట్యాక్షన్కమిటీ-జేఏసీకి చెందిన ఇద్దరికి కీలక పదవులు దక్కాయి.
Also Read: స్మార్ట్‌ఫోన్ అంటే ఇట్లుండాలి.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
అమరాతి జేఏసీలో చురుగ్గా వ్యవహరించిన డాక్టర్రాయపాటి శైలజను ఏపీ మహిళా కమిషన్చైర్పర్సన్గా, ఆలపాటి సురేశ్ ను ప్రెస్అకాడమీ చైర్మన్ గా నియమించారు. మొత్తం 22 పదవుల్లో టీడీపీకి 16, జనసేనకి 3, బీజీపీకి 1, అమరావతి జేఏసీకి 2 పదవులు దక్కాయి. టీడీపీ తీసుకున్న 16 పదవుల్లో 8 మంది బీసీలకు అవకాశం ఇవ్వగా మిగిలిన వారు ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారున్నారు. మాజీ మంత్రులు పీతల సుజాత, కేఎస్జవహర్కు కార్పొరేషన్ల చైర్మన్ పదవులు దక్కాయి.
గత సార్వత్రిక ఎన్నికల్లో పలు రాజకీయ సమీకరణాలతో ఆయా స్థానాల్లో పోటీ చేయలేని వారికి, పార్టీ కోసం, అభ్యర్థుల విజయానికి కృషి చేసిన నేతలకు ఈసారి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం కల్పించింది. నామినేటెడ్ పోస్టుల భర్తీలో సామాజిక న్యాయానికే పెద్దపీట వేసింది. బీసీలకు 8, ఎస్సీలు 2, ఎస్టీలకు ఒక పదవి దక్కాయి. మొత్తం పదవుల్లో 36 శాతం బీసీలకు కూటమి ప్రభుత్వం అవకాశం కల్పించింది.
నామినేటెడ్ పదవుల్లో మాజీ ఎమ్మెల్యేలు బూరుగుపల్లి శేషారావు, సుగుణమ్మ, తాడేపల్లిగూడెం టీడీపీ ఇన్చార్జి వలసల బాబ్జికి అవకాశం కల్పిచింది. టికెట్లు వదులుకున్న ఈ ముగ్గురికి ప్రాధాన్యం కల్పించింది. ఇక మన్నటి ఎన్నికల్లో కొవ్వూరు నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి కేఎస్జవహర్టికెట్ఆశించగా..రాజకీయ సమీకరణాలతో ఆయనకు అది దక్కలేదు. అయితే పార్టీని నమ్ముకుని విధేయంగా ఉండడంతో జవహర్ను ఎస్సీ కమిషన్ఛైర్మన్గా కూటమి ప్రభుత్వం నియమించింది.
టిక్కెట్లు వదులుకున్న వారికి ప్రభుత్వం న్యాయం
ఇలా టిక్కెట్లు వదులుకున్న వారికి కూటమి ప్రభుత్వం న్యాయం చేసింది. ఇలా కొంతమంది నేతలకు న్యాయం జరిగితే..ఇంకా పదవులు దక్కని నేతలు చాలామంది సీనియర్లు కూడా ఉన్నారు. వీరిలో ముందు వరుసలో మాజీ మంత్రి దేవినేని ఉమా, గొట్టిపాటి రామకృష్ణ, బుద్దా వెంకన్న, టీడీ జనార్దన్, కంభంపాటి రామ్మోహన్, పరుచూరి కృష్ణ, కొమ్మలపాటి శ్రీధర్, నాగూల్ మీరా, మాజీ ఎమ్మెల్యే రామానాయుడు, నల్లపాటి రాము, ఎంఎస్ బేగ్, హనుమంతరావు, గంటా గౌతమ్, ఆశా, ఫతావుల్లా, కనపర్తి శ్రీనివాసరావు, చిరుమామిళ్ల మధు, ముద్రబోయిన వెంకటేశ్వరరావు, అన్నాబత్తుని జయలక్ష్మి, కలమట వెంకటరమణ తదితరులు ఉన్నారు. వీరంతా నామినేటెడ్ పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. మరి అలాంటి వారికి రాబోయే రోజుల్లో తప్పకుండా న్యాయం చేస్తానని వారికి చంద్రబాబు మాటిచ్చారు.
మిగిలిన కొద్దిపాటి నామినేటెడ్ పదవులకు హెవీ కాంపిటేషన్ ఏర్పడుతోంది. 2024 ఎన్నికల్లో సీట్ల త్యాగం చేసిన వారికి ప్రాధాన్యత ఇస్తున్న కూటమి ప్రభుత్వం..మిగిలిన నేతలకు ఎలాంటి పదవులను కట్టబెట్టబోతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పిఠాపురం వర్మతో మరికొంతమంది నేతలు ఎమ్మెల్సీ స్థానాలను ఆశిస్తున్నారు. అయితే దామాషా ప్రకారమే పదవుల పంపకాలను చేపట్టారు చంద్రబాబు. అయితే పార్టీకోసం కష్టపడిన వారందరికీ ఏదో విధంగా న్యాయం చేస్తానని చంద్రబాబు హామీ ఇస్తున్నారు. నామినేటెడ్ పదవులు ఇవ్వలేని వారికి పార్టీ పదవుల్లో అవకాశం కల్పిస్తామని చెప్తున్నారు.