Samsung Galaxy S25 Edge: స్మార్ట్‌ఫోన్ అంటే ఇట్లుండాలి.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!

Samsung Galaxy S25 Edge: పేరుకు తగ్గట్టుగానే గెలాక్సీ S25 ఎడ్జ్ అత్యంత స్లిమ్ డిజైన్‌తో రాబోతోంది.

Samsung Galaxy S25 Edge: స్మార్ట్‌ఫోన్ అంటే ఇట్లుండాలి.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!

Updated On : May 12, 2025 / 9:58 PM IST

Samsung Galaxy S25 Edge: సాంసంగ్ అభిమానులంతా అత్యంత స్లిమ్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ S25 ఎడ్జ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ కొన్ని గంటల్లో విడుదల అవుతుంది.

ఇది గెలాక్సీ S సిరీస్‌లో భాగంగా రాబోయే ఒక వినూత్న మోడల్. లీకైన సమాచారం ప్రకారం.. ఈ ఫోన్ కేవలం 5.85mm మందంతో రాబోతోంది. ఈ ఫోన్ లీకైన స్పెసిఫికేషన్లు, ఫీచర్లు కూడా ఆకట్టుకుంటున్నాయి. ఈ కొత్త గెలాక్సీ S25 ఎడ్జ్ కి సంబంధించి లీకైన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ ధర

శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ ఫోన్ మొదట దక్షిణ కొరియా, చైనా మార్కెట్లలో విడుదల కానుంది. ఆ తరువాత త్వరలోనే భారత దేశంతో సహా ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. లీకైన సమాచారం ఆధారంగా భారతలో ఈ ఫోన్ అంచనా ధరలు ఇలా ఉండవచ్చు.

(చదవండి:  OnePlus 13s వచ్చేస్తోంది.. ఇండియాలో లాంచ్ వివరాలు లీక్.. ఫీచర్లు అదరహో )

ధర సుమారు రూ.99,999 నుంచి రూ.1,29,999 వరకు ఉండే అవకాశం ఉంది.

256GB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ.1,18,600 ఉండవచ్చని అంచనా.

512GB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ.1,30,000 ఉండవచ్చని అంచనా.

ఇవి కేవలం అంచనా ధరలు మాత్రమే, అధికారిక ధరలు లాంచ్ సమయంలో వెల్లడవుతాయి.

డిజైన్, డిస్‌ప్లే: స్లిమ్ బాడీ, సూపర్ స్క్రీన్

పేరుకు తగ్గట్టుగానే గెలాక్సీ S25 ఎడ్జ్ అత్యంత స్లిమ్ డిజైన్‌తో రాబోతోంది. లీకుల ప్రకారం దీని మందం కేవలం 5.85mm, బరువు కేవలం 163 గ్రాములు మాత్రమే. డిజైన్ పరంగా ఇది చాలా ప్రీమియం లుక్‌తో ఉంటుంది.

స్క్రీన్: 6.7 అంగుళాల AMOLED డిస్‌ప్లేతో రానుంది. ఇది 3120 x 1440 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో ఉంటుంది.

రిఫ్రెష్ రేట్ : స్మూత్ విజువల్స్ కోసం 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉంది.

డిస్‌ప్లే ప్రొటెక్షన్ : స్క్రీన్‌ ప్రొటెక్షన్ కోసం Gorilla Glass Ceramic 2 ను వాడారు.

బ్యాక్ ప్యానెల్ : ఫోన్ వెనుక భాగంలో Gorilla Glass Victus 2 ప్రొటెక్షన్ ఉంది.

ఫ్రేమ్ : ఫ్రేమ్ కోసం దృఢమైన టిటానియం మెటల్ ను ఉపయోగించారు.

లభించే రంగులు : లీకుల ప్రకారం ఈ ఫోన్ టైటానియం బ్లూ, టైటానియం సిల్వర్, టైటానియం బ్లాక్ రంగులలో లభించవచ్చు.

కెమెరా, పనితీరు: ఫొటోగ్రఫీ, స్పీడ్ ఎలా ఉంటుంది?

ప్రధాన కెమెరా : బ్యాక్‌సైడ్ 200MP సెన్సార్ ఉండొచ్చు.

అల్ట్రా వైడ్ కెమెరా : వైడ్ యాంగిల్ షాట్స్ కోసం 12MP అల్ట్రా వైడ్ కెమెరా ఉండనుంది.

సెల్ఫీ కెమెరా : ముందు భాగంలో 12MP సెల్ఫీ కెమెరాను అందించారు.

ప్రాసెసర్ :  Qualcomm Snapdragon 8 Elite చిప్‌సెట్‌ను వాడారని తెలుస్తోంది.

ర్యామ్ & స్టోరేజ్ : మల్టీటాస్కింగ్ కోసం 12GB RAM వరకు, అలాగే డేటా స్టోరేజ్ కోసం 512GB వరకు స్టోరేజ్ ఆప్షన్స్ లభించవచ్చు.

ఆపరేటింగ్ సిస్టం: ఈ ఫోన్ తాజా Android 15 బేస్డ్‌గా వచ్చే One UI 7 పై రన్ అవుతుంది.

(చదవండి:  Google Pixel 9 Pro XL స్మార్ట్‌ఫోన్‌పై కళ్లుచెదిరే ఆఫర్.. వేలాది రూపాయల డిస్కౌంట్ )

బ్యాటరీ, ఛార్జింగ్: సన్నని ఫోన్‌లో బ్యాటరీ ఎలా?

బ్యాటరీ కెపాసిటీ : లీకుల ప్రకారం, ఇందులో 3900mAh బ్యాటరీ ఉండనుంది.

వైర్డ్ ఛార్జింగ్ : 25W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

వైర్‌లెస్ ఛార్జింగ్: కొత్త Qi2 స్టాండర్డ్ ఆధారంగా వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ లభిస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ స్మార్ట్‌ఫోన్ అత్యంత సన్నని డిజైన్, ప్రీమియం బిల్డ్ మెటీరియల్స్, పవర్ ఫుల్ ప్రాసెసర్, కెమెరాతో రాబోతుందని లీకైన వివరాలు స్పష్టం చేస్తున్నాయి. సుమారు రూ.1 లక్ష పైనే ఉండొచ్చనే అంచనా ధరతో ఇది ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్ లోకి వస్తుంది. ఈ ఫోన్‌పై పూర్తి అధికారిక స్పెసిఫికేషన్లు, ధర అలాగే ఇతర ఫీచర్స్ వివరాలు రేపు సాంసంగ్ ప్రకటించనుంది. అన్ని తాజా, అధికారిక సమాచారం కోసం 10tv.in వెబ్‌సైట్‌ను ఫాలో అవుతూ ఉండండి!