OnePlus 13s వచ్చేస్తోంది.. ఇండియాలో లాంచ్ వివరాలు లీక్.. ఫీచర్లు అదరహో
ఫోన్ డిజైన్, లీకైన స్పెసిఫికేషన్లు, ధర, లాంచ్ తేదీ వివరాలు ఇక్కడ చూడండి..

OnePlus
OnePlus 13s: మీరు తక్కువ బడ్జెట్ లో మంచి క్వాలిటీ స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా? అయితే మీకో శుభవార్త. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ తన కొత్త ఫోన్ సిరీస్‌లో భాగంగా “వన్‌ప్లస్ 13s”ను త్వరలోనే భారత మార్కెట్‌లో విడుదల చేయడానికి సిద్ధమవుతోంది.
దీన్ని వన్‌ప్లస్ 13 సిరీస్‌లో రాబోయే కాంపాక్ట్ మోడల్(చిన్న సైజు స్మార్ట్‌ఫోన్)గా అంచనా వేస్తున్నారు. అధికారిక లాంచ్ తేదీ, పూర్తి స్పెసిఫికేషన్లు, ధర వివరాలు ఇంకా వెల్లడి కానప్పటికీ, లీకైన సమాచారం ఆధారంగా ఈ ఫోన్ గురించి కీలక విషయాలు బయటపడ్డాయి. వన్‌ప్లస్ అభిమానులను ఆకట్టుకునేలా కనిపిస్తున్న ఈ కొత్త వన్‌ప్లస్ 13s లో ఏమేం ఫీచర్లు ఉండబోతున్నాయో చూద్దాం.
వన్‌ప్లస్ 13s: ఆకట్టుకునే డిజైన్
వన్‌ప్లస్ ఇప్పటికే ఈ కొత్త ఫోన్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను షేర్ చేసింది. దీన్ని బట్టి చూస్తే, OnePlus 13s డిజైన్ చాలా స్లీక్‌గా, చేతిలో ఇమిడిపోయేలా కాంపాక్ట్‌గా.. అదేవిధంగా ప్రీమియం ఫినిష్ తో కనిపిస్తోంది. ఫోన్ వెనుక భాగంలో నిలువుగా అమర్చిన (వర్టికల్) డ్యూయల్ కెమెరా సెటప్‌తో పాటు ఫ్లాష్ ఉంటుంది. ముందు భాగంలో, స్క్రీన్ పైభాగంలో మధ్యలో పంచ్ హోల్ కెమెరా కట్‌ఔట్ అందించనున్నారు. మొత్తం మీద, డిజైన్ పరంగా వన్‌ప్లస్ 13s యూజర్లను ఆకట్టుకునే అవకాశం ఉంది.
వన్‌ప్లస్ 13s లీకైన స్పెసిఫికేషన్లు
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఈ వన్‌ప్లస్ 13s మోడల్ గతంలో చైనా మార్కెట్‌లో విడుదలైన వన్‌ప్లస్ 13T ఫోన్‌కు రీబ్రాండెడ్ వెర్షన్‌గా ఉండే అవకాశం ఉంది. లీకుల ప్రకారం ఈ ఫోన్ ముఖ్యమైన స్పెసిఫికేషన్లు ఇలా ఉన్నాయి: (చదవండి: ట్రెండ్ మారుతోంది.. కొత్త స్మార్ట్‌ఫోన్లు ఎలా వస్తున్నాయో తెలుసా? ఇకపై వీటినే వాడతామా? )
♦ డిస్‌ప్లే: 6.32 అంగుళాల పరిమాణంలో, అధిక రిజల్యూషన్ (1.5K) క్రిస్ప్‌గా ఉండే OLED డిస్‌ప్లే.
♦ రిఫ్రెష్ రేట్: స్మూత్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ కోసం 120Hz రిఫ్రెష్‌రేట్ సపోర్ట్.
♦ ప్రాసెసర్: కొత్తగా వచ్చిన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్.
♦ ర్యామ్, స్టోరేజ్: మల్టీటాస్కింగ్, డేటా స్టోరేజ్ కోసం 12GB RAM వరకు, 512GB ఇంటర్నల్ స్టోరేజ్.
♦ బ్యాటరీ: ఎక్కువసేపు పనిచేయడానికి 6,260mAh సామర్థ్యంతో భారీ బ్యాటరీ.
♦ చార్జింగ్: వేగవంతమైన ఛార్జింగ్ కోసం 90W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్.
♦ కెమెరా సెటప్: బ్యాక్‌సైడ్ డ్యూయల్ కెమెరా సిస్టమ్ – అధిక రిజల్యూషన్‌తో 50MP మెయిన్ కెమెరా, 2x ఆప్టికల్ జూమ్‌తో 50MP టెలిఫోటో లెన్స్ ఉన్నట్లు సమాచారం.
♦ ప్రత్యేక ఫీచర్: అలర్ట్ స్లైడర్‌కు బదులుగా కొత్తగా “ప్లస్ కీ” అనే అదనపు ఫీచర్ ఈ ఫోన్‌లో వస్తుంది.
వన్‌ప్లస్ 13s ఇండియా లాంచ్ తేదీ (అంచనా)
వన్‌ప్లస్ సంస్థ ఇప్పటి వరకు వన్‌ప్లస్ 13s స్మార్ట్‌ఫోన్ అధికారిక లాంచ్ తేదీని ప్రకటించలేదు. అయితే, లీకుల ప్రకారం.. ఈ కొత్త డివైస్ ఈ నెల చివర్లో భారత మార్కెట్‌లో అధికారికంగా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సిందే. (చదవండి: విద్యార్థులకు ఈ మూడు 5G స్మార్ట్‌ఫోన్‌లు చాలా బెస్ట్.. వీటిపై ఆఫర్‌లు ఉన్నాయి.. ఫీచర్లు అదరహో.. )
వన్‌ప్లస్ 13s భారతలో ధర అంచనా
వన్‌ప్లస్ 13s స్మార్ట్‌ఫోన్ ధర భారత్‌లో ఎంత ఉండనుంది? అనేది ఇంకా స్పష్టంగా తెలియదు. కానీ లీకైన సమాచారం ఆధారంగా అలాగే మార్కెట్ అంచనాల ప్రకారం, ఈ ఫోన్ సుమారుగా రూ.46,000 ధరతో మార్కెట్‌లోకి రావొచ్చని అంచనా వేస్తున్నారు. వన్‌ప్లస్ ఇతర మోడల్స్ వన్‌ప్లస్ 13R, వన్‌ప్లస్ 13 లభ్యమవుతున్న ధరలకు మధ్య రేంజ్‌లో వన్‌ప్లస్ 13s స్మార్ట్‌ఫోన్ ధర ఉంటుందని తెలుస్తోంది.
వన్‌ప్లస్ 13s కాంపాక్ట్ డిజైన్, మంచి స్పెసిఫికేషన్లు, ఆకట్టుకునే ఫీచర్లతో వస్తుందని లీకుల ద్వారా తెలుస్తోంది. అధికారిక లాంచ్, ధరల ప్రకటన కోసం వన్‌ప్లస్ నుంచి వచ్చే మరిన్ని వివరాల కోసం వేచి చూడాలి. ఈ ఫోన్ గురించి మీకు ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే అధికారిక వెబ్ సైట్ లో ఉన్న సపోర్ట్ ఆప్షన్ లో తెలుసుకోవచ్చు.
Do more, do it all. #OnePlus13s #PlusKey pic.twitter.com/aaWma0UHZ4
— OnePlus India (@OnePlus_IN) May 8, 2025