Purandheswari : కేంద్రం నిధులను పక్కదారి పట్టిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం : పురంధేశ్వరి

మద్యం డిస్టిలరీలు అన్నీ అధికార పార్టీ పెద్దల సన్నిహితులకే ఇచ్చారని ఆరోపించారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని విమర్శించారు. ఒక చేత్తో గుంజుతూ రెండో చేత్తో తాయిలాలు ఇస్తున్నారని పేర్కొన్నారు.

Purandheswari : కేంద్రం నిధులను పక్కదారి పట్టిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం : పురంధేశ్వరి

Purandheswari

BJP State Level Meeting : పార్టీని బలోపేతం చేయడం తన ఒక్కరి వల్లే సాధ్యం కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పేర్కొన్నారు. సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై అందరూ దృష్టి సారించాలన్నారు. ఎన్నికలకు ఐదారు నెలలు మాత్రమే సమయం ఉందని తెలిపారు. బూత్ కమిటీలు, మండలం కమిటీలపై దృష్టి పెట్టాలని సూచించారు. సంస్థాగత మార్పులతో వచ్చే ఎన్నికల్లో బలీయమైన శక్తిగా ఎదుగుతామని చెప్పారు. ఆదివారం విజయవాడ బీజేపీ ఏపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర స్థాయి పదాధికారుల సమావేశం ప్రారంభమైంది.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. సమావేశానికి జాతీయ సహ సంఘటన ప్రధాన కార్యదర్శి శివ‌ప్రకాష్, కేంద్ర‌మంత్రి మురళీధరణ్, సునీల్ దేవధర్, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఎంపీ జీవీఎల్, సత్యకుమార్, రాష్ట్ర కమిటీతో పాటు జిల్లాల ఇన్ చార్జీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక వాతావరణం ఉందన్నారు. వైసీపీ ఇచ్చిన వాగ్ధానాలు నెరవేరలేదని పేర్కొన్నారు.

Tirumala EO Darmareddy : శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్ల అదనపు కోటా విడుదల చేస్తాం : ఈవో ధర్మారెడ్డి

మద్యం డిస్టిలరీలు అన్నీ అధికార పార్టీ పెద్దల సన్నిహితులకే ఇచ్చారని ఆరోపించారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని విమర్శించారు. ఒక చేత్తో గుంజుతూ రెండో చేత్తో తాయిలాలు ఇస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల సొమ్మును సొంత జేబుల్లో నుంచి ఇస్తున్నట్లు చూపిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువయ్యాయని తెలిపారు. ఉద్యోగాల విషయంలో యువతను మభ్య పెడుతున్నారని విమర్శించారు.

పారిశ్రామికవేత్తలను ఇబ్బంది పెట్టడంతో పెట్టుబడులు రావడం లేదన్నారు. ఇసుక అక్రమ మైనింగ్ తో అన్నమయ్య ప్రాజెక్టు గేట్ కొట్టుకుపోయిందని విమర్శించారు. కేంద్రం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందన్నారు. ప్రజా సమస్యల పట్ల పోరాడితే ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగవచ్చని తెలిపారు. 2014 తర్వాత పార్టీని బలోపేతం చేసుకునేందుకు ఒంటరిగా వెళ్లాలని చాలా మంది సూచించారని పేర్కొన్నారు.