Tirumala EO Darmareddy : శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్ల అదనపు కోటా విడుదల చేస్తాం : ఈవో ధర్మారెడ్డి

ఆలయ నిర్మాణాలు నాలుగు విధానాలలో నిర్వహిస్తున్నామని తెలిపారు. దేవాదాయ శాఖ, టీటీడీ, ఆలయ కమిటీలు, సమరసత్తా స్వచ్ఛంద సంస్థ ద్వారా మాత్రమే ఆలయ నిర్మాణాలు చేస్తున్నామని చెప్పారు.

Tirumala EO Darmareddy : శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్ల అదనపు కోటా విడుదల చేస్తాం : ఈవో ధర్మారెడ్డి

EO Darmareddy

Updated On : July 16, 2023 / 1:06 PM IST

Tirumala Srivari Special Darshanam : తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. తిరుమల శ్రీవారి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్ల అదనపు కోటా విడుదల చేస్తామని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలకు సంబంధించి రోజుకి 4 వేల చొప్పున అదనపు టిక్కెట్లు విడుదల చేస్తామని వెల్లడించారు. దీంతో భక్తులకు తిరుమల శ్రీవారిని దర్శించుకునే మరింత భాగ్యం కలగనుందని చెప్పారు.

Special Buses : తిరుమల, షిర్డీకి ఏసీ స్లీపర్ ప్రత్యేక బస్సులు

శ్రీవాణి ట్రస్టు ఆలయ నిర్మాణాలను కొంతమంది కాంట్రాక్టర్లకు మాత్రమే ఇస్తున్నామని అసంబద్దమైన ఆరోపణ చేశారని ఈవో ధర్మారెడ్డి పేర్కొన్నారు. ఆలయ నిర్మాణాలు నాలుగు విధానాలలో నిర్వహిస్తున్నామని తెలిపారు. దేవాదాయ శాఖ, టీటీడీ, ఆలయ కమిటీలు, సమరసత్తా స్వచ్ఛంద సంస్థ ద్వారా మాత్రమే ఆలయ నిర్మాణాలు చేస్తున్నామని చెప్పారు. పార్వేటి మండపం శిథిలావస్థకు చేరుకోవడంతోనే జీర్ణోద్దారణ చేస్తున్నామని ఈవో ధర్మారెడ్డి పేర్కొన్నారు.

Also Read: ఈ ఏడాది అధిక శ్రావణ మాసాలు, వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు చేసుకోవాలో తెలుసా..?