AP 10th Results: ఏపీ టెన్త్ ఫలితాల్లో బాలికలదే హవా.. ఫలితాల్లో ఏ జిల్లా ఫస్ట్.. ఏ జిల్లా లాస్ట్.. ఫుల్ డీటెయిల్స్ ఇలా..
ఏపీలో పదో తరగతి పరీక్షల ఫలితాలు వచ్చేశాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆన్ లైన్ లో ఫలితాలను విడుదల చేశారు.

AP 10th Results
AP 10th Results: ఏపీలో పదో తరగతి పరీక్షల ఫలితాలు వచ్చేశాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆన్ లైన్ లో ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది జరిగిన పరీక్షలకు మొత్తం 6,14,459 మంది విద్యార్థులు హాజరుకాగా.. వీరిలో 4,98,585 మంది విద్యార్థులు (81.14శాతం) ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలురు 78.31శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలికలు 84.09శాతం ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రంలోని 1,680 పాఠశాలల్లో వందశాతం ఫలితాలు
రాగా.. 19పాఠశాలల్లో ఎవ్వరూ పాస్ కాలేదు.
జిల్లాల వారిగా ఫలితాలను పరిశీలిస్తే.. ఉత్తీర్ణతలో పార్వతీపురం మన్యం అగ్రస్థానంలో ఉంది. ఈ జిల్లాలో 93.90శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఆ తరువాత స్థానంలో బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నిలిచింది. ఈ జిల్లాలో 91.43శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. మూడో స్థానంలో విశాఖపట్టణం జిల్లా నిలిచింది. ఈ జిల్లాలో 89.14శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో చివరి స్థానంలో అల్లూరి సీతారామరాజు జిల్లా నిలిచింది. ఈ జిల్లాలో 47.64శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
జిల్లాల వారిగా ఉత్తీర్ణత శాతం ఇలా..