AP 10th Results: ఏపీ పదో తరగతి ఫలితాలు వచ్చేశాయ్.. విడుదల చేసిన మంత్రి లోకేశ్.. విద్యార్థులూ ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి..
ఏపీలో పదో తరగతి పరీక్షల ఫలితాలు వచ్చేశాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఫలితాలను విడుదల చేశారు.

AP 10th Class Results Released
10th Class Results: ఏపీలో పదో తరగతి పరీక్షల ఫలితాలు వచ్చేశాయి. బుధవారం ఉదయం 10గంటలకు ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ ఫలితాలను విడుదల చేశారు. ఈ సంవత్సరం, 6,14,459 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, 4,98,585 మంది (81.14%) ఉత్తీర్ణులయ్యారు. బాలురు 78.31శాతం, బాలికలు 84.09శాతం ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రంలోని మొత్తం 1,680 పాఠశాలు 100శాతం ఉత్తీర్ణత సాధిచంగా.. 19 పాఠశాలల్లో విద్యార్థులెవరూ ఉత్తీర్ణత సాధించలేదు. ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా 93.90శాతం ఫలితాలతో అగ్రస్థానంలో నిలిచింది.
ఫలితాలు విడుదల చేసిన సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ.. పదో తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఉత్తీర్ణత సాధించని విద్యార్థులు నిరుత్సాహపడొద్దని సూచించారు. మే 19వ తేదీ నుంచి 28వ తేదీ వరకు టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
ఈ ఫలితాలను https://bse.ap.gov.in, https://apopenschool.ap.gov.in/ వెబ్ సైట్లు.. మనమిత్ర వాట్సాప్ యాప్ లో విద్యార్థులు తెలుసుకోవచ్చు. అదేవిధంగా https://10tv.in/ap-ssc-results-2025 లోనూ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఈ ఏడాది 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు 6,19,275 మంది రెగ్యులర్ విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ఇంగ్లిష్ మీడియంకు సంబంధించి 5,64,064 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. తెలుగు మీడియంలో 51,069 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇదిలాఉంటే.. ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్మీడియట్ ఫలితాలు కూడా టెన్త్ ఫలితాలతో పాటే విడుదల చేశారు.
ఏపీ పదో తరగతి ఫలితాలు | Check Ap 10th Class Results 2025
వాట్సాప్ లో ఫలితాలు ఇలా తెలుసుకోవచ్చు ..
◊ విద్యార్థులు తమ మొబైల్ ఫోన్ వాట్సాప్ లో 9552300009 నంబర్‌కు “Hi” అని మెసేజ్ చేయాలి.
◊ వెంటనే సేవను ఎంచుకోండి అనే ఆప్షన్ వస్తుంది.
◊ అందులో విద్యా సేవలను ఎంచుకోవాలి.
◊ అనంతరం SSC పబ్లిక్ పరీక్షల ఫలితాలను సెలక్ట్ చేయాలి.
◊ అక్కడ రోల్ నెంబర్ ను ఎంటర్ చేయడం ద్వారా ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.
◊ ఈ రిజల్ట్ పీడీఎఫ్ కాపీని డౌన్ లోడ్ చేసుకోవచ్చు.