AP Rain Alert : ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు.. 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్!
AP Rain Alert : ఆంధ్రప్రదేశ్లో ఇవాళ రాత్రి, రేపు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
AP Rain Alert
AP Rain Alert : ఆంధ్రప్రదేశ్లో ఇవాళ రాత్రి, రేపు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
Also Read : Palapitta Bird : ప్రమాదంలో పాలపిట్టల మనుగడ.. ఈసారి పండుగకు దర్శనం కరువేనా? అసలెందుకిలా జరుగుతుంది..
రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో వర్ష ప్రభావం ఉండే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
మరోవైపు పలు ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. రంపచోడవరం, నర్సీపట్నం, కృష్ణదేవిపేట, రౌతులపూడి, మాడుగుల, ఓర్వకల్లు, వెల్దుర్తి, డోన్, గుత్తి, పొదిలి, బద్వేలు, సత్యవేడు, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట, నాయుడుపేట, గొట్టిప్రోలు తదితర ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వర్సాలు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో ఉండకూడదని, బహిరంగ ప్రదేశాల్లో సంచరించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే సమయంలో వీలైనంతవరకు సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని అధికారులు సూచిస్తున్నారు.
