Prakasam District : ప్రకాశం జిల్లాకు నూతన కలెక్టర్ నియామకం
ప్రకాశం జిల్లా కలెక్టర్ ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. నూతన కలెక్టర్ గా ప్రవీణ్ కుమార్ ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ

Prakasam District
Prakasam District :ప్రకాశం జిల్లా కలెక్టర్ ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. నూతన కలెక్టర్ గా ప్రవీణ్ కుమార్ ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు ఉన్నపలంగా అమల్లోకి వస్తాయని పేర్కున్నారు. నిన్నటివరకూ ఉన్న కలెక్టర్ పోలా భాస్కర్ ను విద్యాశాఖ కమిషనర్ గా నియమించింది.
ఇక నూతన కలెక్టర్ గా నియమితులైన ప్రవీణ్ కుమార్ పర్యాటక అభివృద్ధి శాఖలో మేనేజింగ్ డైరెక్టర్ గా విధులు నిర్వర్తించారు. కాగా దాదాపు రెండేళ్లపాటు ప్రకాశం జిల్లాకు కలెక్టర్ గా పనిచేశారు పోలా భాస్కర్.. జిల్లాకు వరప్రదాయిని అయిన వెలిగొండ ప్రాజెక్టు మొదటి టన్నెల్ పూర్తిచేయించడానికి ఆయన కృషి చేశారు. ప్రస్తుతం రెండో టన్నెల్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.