సీఎం జగన్ నన్ను రోడ్డు మీద నిలబెట్టేలా చేస్తున్నారు – జేసీ

  • Published By: madhu ,Published On : January 12, 2020 / 10:54 AM IST
సీఎం జగన్ నన్ను రోడ్డు మీద నిలబెట్టేలా చేస్తున్నారు – జేసీ

Updated On : January 12, 2020 / 10:54 AM IST

రాజకీయంగా సీఎం జగన్ తనను ఏమి చేయలేడని..అయితే..ఆర్థికంగా రోడ్డు మీద నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వెల్లడించారు. రాజధాని తరలింపు విషయంలో ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. 2020, జనవరి 12వ తేదీ ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రేటర్ రాయలసీమ ఉద్యమం వస్తే..కడప రాజధాని చేయాలనే డిమాండ్ వినిపిస్తానన్నారు. రెండు కులాల మధ్య రచ్చగా మారిందని, బాబుపై కక్ష సాధింపు చర్యలో భాగంగానే రాజధాని అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని విమర్శించారు. రాజధాని మార్పు చేస్తే మాత్రం గ్రేటర్ రాయలసీమ ఉద్యమం తప్పదని హెచ్చరించారు. 

అమరావతి, విశాఖ, రాజధాని ప్రాంతాల్లో భూములు కొన్నవారిపై మండిపడ్డారు. భూములు కొన్న టీడీపీ, వైసీపీ నేతలు ఇద్దరూ దొంగలే అన్నారు. రెండు పార్టీలు వారు 150 మంది వరకు ల్యాండ్స్ కొని ఉండవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఐదు కోట్ల మందికి ఏ విధంగా ఉపయోగడుతుందో చూడాలన్నారు. 

అమరావతి ముంపు ప్రాంతం కాదని స్పష్టం చేశారు. అసెంబ్లీ, సెక్రటేరియట్‌లు టెంపర్ అన్న వైసీపీ వాళ్లకు టెంపర్ వచ్చిందన్నారు. అమరావతిలో మంచి భూములు కొనాలని బాబు కలలు కన్నారని తెలిపారు. కృష్ణా నదిపై ప్రాజెక్టులు కట్టిన తర్వాత ముంపేలేదన్నారు జేసీ.