Guntur Army Jawan: స్వగ్రామానికి జశ్వంత్ రెడ్డి మృతదేహం.. నేడు అంత్యక్రియలు!
దేశ సరిహద్దుల్లో జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిలో ముష్కర మూకలతో పోరాడుతూ అమరుడైన గుంటూరు జిల్లాకు చెందిన వీర జవాన్ జశ్వంత్ మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. రాజౌరీ జిల్లాలో జరిగిన కాల్పుల్లో.. బాపట్ల మండలం దరివాద కొత్తపాలెంకు చెందిన మారుప్రోలు జశ్వంత్ రెడ్డి మరణించారు.

Guntur Army Jawan
Guntur Army Jawan: దేశ సరిహద్దుల్లో జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిలో ముష్కర మూకలతో పోరాడుతూ అమరుడైన గుంటూరు జిల్లాకు చెందిన వీర జవాన్ జశ్వంత్ మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. రాజౌరీ జిల్లాలో జరిగిన కాల్పుల్లో.. బాపట్ల మండలం దరివాద కొత్తపాలెంకు చెందిన మారుప్రోలు జశ్వంత్ రెడ్డి మరణించారు. కొత్తపాలెం గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరమ్మ కుమారుడు జశ్వంత్ రెడ్డి.
మరికొద్ది రోజుల్లో జశ్వంత్ రెడ్డికి వివాహం చేయాలని భావిస్తున్నలోపే ఉగ్రదాడిలో మరణించడంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా, జవాన్ జశ్వంత్ రెడ్డి మృతదేహాం బాపట్లకు చేరుకుంది. ప్రత్యేక వాహనంలో మద్రాస్ రెజిమెంట్ సైనికులు మృతదేహాన్ని తీసుకొచ్చారు. జశ్వంత్ రెడ్డి మృతదేహానికి ఉప సభాపతి కోన రఘుపతి నివాళులర్పించారు. బాపట్ల నుంచి కొత్తపాలెం వరకు మాజీ సైనికుల ఆధ్వర్యంలో ఊరేగింపు మధ్య మృతదేహాన్ని తరలించారు.
నేడు శనివారం కొత్తపాలెంలో జశ్వంత్ రెడ్డి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంత్యక్రియల్లో హోంమంత్రి మేకతోటి సుచరిత పాల్గొననున్నారు. జశ్వంత్ రెడ్డి 17 మద్రాస్ రెజ్మెంట్ లో 2016లో సైనికునిగా చేరగా శిక్షణ తర్వాత నీలగిరిలో మొదటగా విధులు నిర్వహించి.. అనంతరం జమ్ముకశ్మీర్‌కు వెళ్లగా.. అక్కడే విధులు నిర్వహిస్తూ వీరమరణం పొందారు. సరిహద్దుల్లో మరణించిన సైనికుడు జశ్వంత్ రెడ్డికి మాజీ సైనికుల సంఘం సంతాపం తెలిపింది.