Ashok Gajapathi Raju : చంద్రబాబు అరెస్టుపై అశోక్ గజపతి రాజు సంచలన వ్యాఖ్యలు

ఇదంతా కేంద్రానికి తెలిసే జరిగిందని తమ నమ్మకం అని పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమమని ఇతర రాష్ట్రాల్లో కూడా అనుకుంటున్నారని తెలిపారు.

Ashok Gajapathi Raju : చంద్రబాబు అరెస్టుపై అశోక్ గజపతి రాజు సంచలన వ్యాఖ్యలు

Ashok Gajapathi Raju

Updated On : September 16, 2023 / 8:49 PM IST

Ashok Gajapathi Raju – Chandrababu Arrest : టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై అశోక్ గజపతి రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా చంద్రబాబు అరెస్ట్ జరిగిందంటే నమ్మబుద్ధి కావడం లేదన్నారు. ఇదంతా కేంద్రానికి తెలిసే జరిగిందని తమ నమ్మకం అని పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమమని ఇతర రాష్ట్రాల్లో కూడా అనుకుంటున్నారని తెలిపారు.

ఈ మేరకు శనివారం ఆయన విజయనగరంలో మీడియాతో మాట్లాడారు. తాను న్యాయవాదిని కాకపోయినా, సుదీర్ఘ కాలంగా చట్టసభల్లో పని చేసిన వ్యక్తిని అని వెల్లడించారు. ప్రభుత్వంలో ఏ నిర్ణయం తీసుకున్నా….అది క్యాబినెట్ మొత్తం బాధ్యత తీసుకుంటుందని చెప్పారు. అది పరిగణలోకి తీసుకోకుండా, ఇప్పుడు చంద్రబాబును జైల్లో పెట్టి సాక్ష్యాలు కోసం వెతుకుతున్నారని పేర్కొన్నారు.

DL Ravindra Reddy: జగన్‌లా చంద్రబాబు నాయుడు చేయరు: మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి

కానీ, సాక్ష్యాలు సేకరించిన తర్వాతే, నాడు 16 నెలలు జగన్ ను జైల్లో పెట్టారని తెలిపారు. ఈ నాలుగేళ్లలో జగన్ ఏమైనా సాధించారంటే అది ప్రతీవారం సంతకం నుంచి మినహాయింపు పొందారని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి లేకుండా రాష్ట్ర భవిష్యత్ ప్రశ్నర్ధకంగా మారిందన్నారు.

కాగా, స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబును అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ కేసులో చంద్రబాబును అరెస్టు చేసిన పోలీసులు విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టగా రిమాండ్ విధించించింది. దీంతో పోలీసులు చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. జైలులో స్నేహ బ్లాక్ ను చంద్రబాబుకు కేటాయించారు. ఆయన ప్రత్యేక గదిని ఇచ్చారు.