DL Ravindra Reddy: జగన్‌లా చంద్రబాబు నాయుడు చేయరు: మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి

చంద్రబాబు దేశం విడిచి వెళ్లే వ్యక్తి కాదని డీఎల్ రవీంద్రారెడ్డి తెలిపారు. ఎప్పుడు విచారణకు పిలిచినా చంద్రబాబు హాజరవుతారని చెప్పారు.

DL Ravindra Reddy: జగన్‌లా చంద్రబాబు నాయుడు చేయరు: మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి

DL Ravindra Reddy

Updated On : September 16, 2023 / 6:48 PM IST

DL Ravindra Reddy – YS Jagan: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి (Chandrababu Naidu) అరెస్టుపై మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు 28 పేజీల రిమాండ్ రిపోర్టులో తప్పు చేసినట్లు ఎక్కడా లేదని అన్నారు. కేసు ఉంటే సీఎం జగన్ లాగా చంద్రబాబు చేయరని అన్నారు.

చంద్రబాబు దేశం విడిచి వెళ్లే వ్యక్తి కాదని డీఎల్ రవీంద్రారెడ్డి తెలిపారు. ఎప్పుడు విచారణకు పిలిచినా చంద్రబాబు హాజరవుతారని చెప్పారు. చంద్రబాబు ఈ వయసులో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఆయనను జైలుకు పంపడం దారుణమని అన్నారు. జగన్ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే చంద్రబాబును జైలుకు పంపారని ఆరోపించారు.

కక్ష సాధింపు చర్యలను మానుకోవాలని అన్నారు. రాష్ట్రంలో విద్యుత్తును కొనేందుకు డబ్బు లేదని అధికారులు అంటున్నారని చెప్పారు. తాను ఇంతటి ఘోరమైన పరిస్థితి ఎప్పుడూ లేదని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకే కూడా డబ్బు లేదని అన్నారు. నిన్న 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించామని చెబుతున్నారని, రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే సౌకర్యాలు లేవని చెప్పారు. జగన్ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు.

CM KCR : పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభం.. పంప్ ఆన్ చేసి నీటిని వదిలిన సీఎం కేసీఆర్