Balineni: జగన్ – షర్మిల ఆస్తుల వివాదంపై బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు..

జగన్, షర్మిల ఆస్తుల విషయం విజయమ్మ చూసుకుంటుంది. మీ కుటుంబంలో మీరు రచ్చ చేసుకుంటూ చంద్రబాబుపై ఆరోపణలు చేస్తున్నారు.

Balineni: జగన్ – షర్మిల ఆస్తుల వివాదంపై బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు..

Balineni Srinivasa Reddy

Updated On : October 28, 2024 / 12:47 PM IST

Balineni Srinivasa Reddy: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి – షర్మిల ఆస్తుల వివాదంపై మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్, షర్మిల ఆస్తుల విషయంలో ఒకరికొకరు లేఖలు రాసుకుంటున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి 40 ఏళ్ళ రాజకీయాల్లో ఎంతో హుందాగా వ్యవహరించారు. ఇప్పుడు షర్మిల, జగన్ వైఎస్ రాజశేఖరరెడ్డిని బజారుకీడుస్తున్నారని అన్నారు. నాకు ఎంతో బాధ కలుగుతుంది.. నాకు వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయ భిక్ష పెట్టారు. వైవి సుబ్బారెడ్డి, నేను బాగుపడింది వైఎస్ విజయమ్మ వల్ల. షర్మిల తన పిల్లల మీద ఒట్టేస్తానని చెప్పింది. వైవి సుబ్బారెడ్డి ఎందుకు మాట్లాడడం లేదని బాలినేని ప్రశ్నించారు.

Also Read: Yanamala: జైలుకెళ్లడం ఖాయం.. జగన్ మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసిన యనమల రామకృష్ణుడు

జగన్, షర్మిల ఆస్తుల విషయం విజయమ్మ చూసుకుంటుంది. మీ కుటుంబంలో మీరు రచ్చ చేసుకుంటూ చంద్రబాబుపై ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయంలో చంద్రబాబుకు, జనసేనకు ఏమి సంబంధం అంటూ బాలినేని ప్రశ్నించారు. జగన్, షర్మిల గొడవను విజయమ్మ పరిష్కరిస్తుందని భావిస్తున్నా. తొందరగా సమస్య పరిష్కారం చూపాలని విజయమ్మను కోరుతున్నానని బాలినేని వ్యాఖ్యానించారు. షర్మిల ఆడపడుచు.. ఆమె కన్నీళ్లు జగన్ కుటుంబానికి అరిష్టం అన్నారు. వైఎస్ ను కుట్ర చేసి చంద్రబాబు చంపించారన్న ఆరోపణలు చేస్తున్నారు.. మరి ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు జగన్ ఏం చేశాడని బాలినేని ప్రశ్నించారు. వైఎస్ ఎలా చనిపోయారో అందరికి తెలుసని అన్నారు. జగన్, షర్మిలకు నాలుగేళ్ల నుంచి ఆస్తుల గొడవలు ఉన్నాయని బాలినేని పేర్కొన్నారు.

Also Read: KTR : ఇంట్లో దావత్ చేసుకుంటే తప్పా.. చేతనైతే రాజకీయంగా తలపడండి.. : కేటీఆర్

నా బిడ్డ సాక్షిగా చెబుతున్న నేను వైసీపీలో ఆస్తులు పోగొట్టుకున్న.. ఆ విషయం జగన్ కు తెలియదా. వైసీపీలో ఉన్నప్పుడు ఎంతో ఖర్చు పెట్టుకున్నా. ఆస్తులు అమ్మి అప్పులు కట్టాను. నేను ఆస్తులు పోగొట్టుకుంటే మీరు ఆస్తులకోసం కొట్టాడుతున్నారు. పవన్ నన్ను ఎన్నికలకు ముందే జనసేనలోకి తీసుకుందామనుకున్నారు. ఆ విషయం స్వయంగా పవన్ కల్యాణే చెప్పారని బాలినేని అన్నారు.