Corona Vaccine : వ్యాక్సిన్ తీసుకున్నా జాగ్రత్తగా ఉండాల్సిందే : గీతా ప్రసాదిని

వచ్చే 6-8 వారాలు చాలా కీలకమని ఏపీ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ గీతా ప్రసాదిని అన్నారు. చాలా వేగంగా కరోనా కేసులు రెట్టింపు అవుతున్నాయని తెలిపారు.

Corona Vaccine : వ్యాక్సిన్ తీసుకున్నా జాగ్రత్తగా ఉండాల్సిందే : గీతా ప్రసాదిని

Corona Vaccine

Updated On : April 18, 2021 / 9:39 PM IST

Corona Vaccine : వచ్చే 6-8 వారాలు చాలా కీలకమని ఏపీ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ గీతా ప్రసాదిని అన్నారు. చాలా వేగంగా కరోనా కేసులు రెట్టింపు అవుతున్నాయని తెలిపారు. ప్రజల్లో కాస్త ఉదాసీనత కనిపిస్తోందన్నారు. 10 టివి నిర్వహించిన క్వశ్వన్ అవర్ ప్రత్యేక కార్యక్రమంలో గీతా ప్రసాదిని మాట్లాడుతూ వ్యాక్సిన్ తీసుకున్నా కూడా జాగ్రత్తగా ఉండాల్సిందేనని చెప్పారు. రెండో డోసు తీసుకున్న రెండు వారాల తర్వాతే వ్యాక్సిన్ నుంచి రక్షణ ఉంటుందని తెలిపారు. రెండో డోసు తీసుకున్నాక వైరస్ సోకిన వారి సంఖ్య చాలా తక్కువన్నారు. అలాంటి వారిలో వైరస్‌ తీవ్రత చాలా తక్కువగా కనిపిస్తోందని చెప్పారు.

140 ఆసుపత్రుల్లో కరోనా రోగులకు చికిత్స
140 ఆసుపత్రుల్లో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఏపీ ఆసుపత్రుల్లో బెడ్ల కొరత లేదని చెప్పారు. రాబోయే వారాల్లో ఆసుపత్రుల్లో పడకల సంఖ్యను పెంచుతామని చెప్పారు. కరోనా వచ్చిన వారు 104కు కాల్‌ చేయాలన్నారు. 104కు ఫోన్‌ చేస్తే బెడ్ల ఖాళీల వంటి వివరాలు తెలుస్తాయని తెలిపారు. హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతారని చెప్పారు. 104 కాల్‌సెంటర్‌లో వైద్యులు కావాల్సిన అన్ని సలహాలు ఇస్తారని తెలిపారు.

వ్యాక్సిన్‌పై అపోహలు అవసరం లేదు
రోజుకు పదివేలకు పైగా కేసులు వచ్చే అవకాశం ఉందన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ స్పీడ్‌ పెంచాల్సి ఉందని తెలిపారు. కరోనాతో పోరాటానికి మాస్క్‌ ఒక్కటే ఆయుధమని పేర్కొన్నారు. ఇంకొందరు ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉందన్నారు. వ్యాక్సిన్‌పై అపోహలు అవసరం లేదన్నారు. వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో ఎలాంటి దుష్ప్రభావాలు లేవని స్పష్టం చేశారు. లాక్‌డౌన్‌ లేకుండానే కరోనాను ఎదుర్కోవాల్సి ఉందన్నారు. వైరస్‌ కట్టడికి టెక్నాలజీని బాగా వినియోగించుకుంటున్నామని తెలిపారు.