Bhanurekha : విజయవాడకు చేరుకున్న భానురేఖ మృతదేహం

ఐటీ ఉద్యోగంతో మంచి భవిష్యత్ ను కాక్షించి బెంగళూరుకు వచ్చిన భానురేఖను అకాల వర్షం బలి తీసుకుంది.

Bhanurekha : విజయవాడకు చేరుకున్న భానురేఖ మృతదేహం

Bhanurekha

Updated On : May 23, 2023 / 10:19 AM IST

Bhanurekha dead body : కర్ణాటకలోని బెంగళూరు అండర్ పాస్ లో చిక్కుకొని చనిపోయిన భానురేఖ మృతదేహం విజయవాడకు చేరుకుంది. భానురేఖ మృతదేహం డీకంపోస్ట్ కాకుండా వైద్యులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. భానురేఖ సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నారని బంధువులు చెబుతున్నారు.  ఆమెకు 8 నెలల క్రితమే ఇన్ఫోసిస్ లో ఉద్యోగం వచ్చిందని తెలిపారు.

భానురేఖ మరణవార్త తెలిసి కుటుంబ సభ్యులు, బంధువులు శోకసముద్రంలో మునిగిపోయారు. భానురేఖ సొంతూరు కృష్ణా జిల్లా తెలప్రోలు గ్రామం. ఆమె మృతితో స్వగ్రామం తెలప్రోలులో విషాదఛాయలు అలుముకున్నాయి. ఉన్నత చదువులు చదివి ఊరుకు మంచి పేరు తెస్తుందనుకున్న అయ్మాయి అకాల మరణం చెందడం బాధకరమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

KR circle underpass tragedy: పాపం భానురేఖ.. బెంగళూరులో అడుగుపెట్టిన రోజే అకాల మరణం.. ఆస్పత్రి నిర్లక్ష్యమే కారణమా..?

ఐటీ ఉద్యోగంతో మంచి భవిష్యత్ ను కాక్షించి బెంగళూరుకు వచ్చిన భానురేఖను అకాల వర్షం బలి తీసుకుంది. బెంగళూరులో ఆదివారం కురిసిన భారీ వర్షం భానురేఖ ప్రాణాలు తీసింది. హైదరాబాద్ నుంచి బెంగళూరులో అడుగు పెట్టిన రోజే ఆమె చనిపోవడం అందరినీ కలచివేస్తోంది. కేఆర్ సర్కిల్ వద్ద అండర్ పాస్ లో వరద నీటిలో చిక్కుకుని భానురేఖ మృతి చెందారు.