AP Corona Cases : ఏపీకి బిగ్ రిలీఫ్.. భారీగా తగ్గిన కరోనా కేసులు

ఏపీలో కరోనా వ్యాప్తి మరింత తగ్గింది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. గడచిన 24 గంటల్లో 500కి లోపే రోజువారీ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 30వేల 515 మందికి కరోనా పరీక్షలు చేయగా, 4

Ap Corona Cases

AP Corona Cases : ఏపీలో కరోనా వ్యాప్తి మరింత తగ్గింది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. గడచిన 24 గంటల్లో 500కి లోపే రోజువారీ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 30వేల 515 మందికి కరోనా పరీక్షలు చేయగా, 429 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

Covid Victims : మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాల్సిందే..కోవిడ్‌‌తో చనిపోయిన ధృవీకరణ పత్రం తప్పనిసరి కాదు

అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 89 కొత్త కేసులు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లాలో 85, చిత్తూరు జిల్లాలో 72, ప్రకాశం జిల్లాలో 43, గుంటూరు జిల్లాలో 40 కేసులు గుర్తించారు. అత్యల్పంగా అనంతపురం, విజయనగరం జిల్లాల్లో ఒక్కో పాజిటివ్ కేసు చొప్పున నమోదయ్యాయి.

Flubot Malware : సెక్యూరిటీ అప్‌డేట్ అని మేసేజ్ వచ్చిందా? అయితే జాగ్రత్త.. క్లిక్ చేస్తే ఖతమే

అదే సమయంలో 1,029 మంది కరోనా నుంచి కోలుకోగా, మరో నలుగురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,53,192 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 20,29,231 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 9వేల 753 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,208కి పెరిగింది.