YSRCP : అధికార వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీలోకి సీఎం జగన్ ముఖ్య అనుచరుడు
YSRCP : వైసీపీ పాలనలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని చూడలేక పార్టీని వీడుతున్నట్లు సుభాష్ చంద్రబోస్ ప్రకటించారు.

YSRCP
Shock For YSRCP : కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో అధికార వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. సీఎం జగన్ ముఖ్య అనుచరుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన పరుచూరి సుభాష్ చంద్రబోస్, ఆయన అనుచరులు శుక్రవారం టీడీపీలో చేరనున్నారు.
సుభాష్ చంద్రబోస్ తో పాటు అవనిగడ్డ, కోడూరు మండలాల నుంచి తెలుగు దేశం పార్టీలోకి చేరికలు ఉండనున్నాయి. రేపు మంగళగిరిలోని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చంద్రబాబు నాయుడు సమక్షంలో సుభాష్ చంద్రబోస్, మిగిలిన నేతలు టీడీపీ కండువా కప్పుకోనున్నారు.
వైసీపీ పాలనలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని చూడలేక పార్టీని వీడుతున్నట్లు సుభాష్ చంద్రబోస్ ప్రకటించారు. చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి, సంక్షేమం సాధ్యమని, అందుకే తెలుగుదేశంలో చేరుతున్నట్లు సుభాష్ చంద్రబోస్ వెల్లడించారు. మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ నేతృత్వంలో రేపు మంగళగిరి బయలుదేరనున్నారు.
సుభాష్ చంద్రబోస్ వైసీపీ కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో కలిసి పాదయాత్ర ప్రారంభం నుండి ముగిసేంతవరకు కొనసాగారు.