ఎన్నికల కదన రంగంలోకి దిగేందుకు ఏపీ బీజేపీ సిద్ధం.. విజయవాడలో రాష్ట్ర పదాధికారుల మీటింగ్
BJP: ఇక వచ్చే నెల 5 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ప్రచారాన్ని చేపట్టనుంది. ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి..

Bjp
కాషాయ దళం ఎన్నికల కదన రంగంలోకి దిగేందుకు సమాయాత్తమవుతుంది. దీనికి సంబంధించి ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి కార్యాచరణను సిద్ధం చేశారు. పొత్తుల్లో భాగంగా బీజేపీ 6 పార్లమెంట్, 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనుంది. ఇప్పటికే ఎంపీ అభ్యర్థుల జాబితా రిలీజ్ కాగా.. అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను నేడో, రేపో రిలీజ్ చేసేందుకు సిద్ధమౌతోంది పార్టీ..
150 మందితో..
విజయవాడలో బీజేపీ రాష్ట్ర పదాధికారుల మీటింగ్ జరుగుతోంది. ఈ సమావేశానికి జాతీయ నాయకులతో పాటు, రాష్ట్ర నేతలు, ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు… దాదాపు 150 మంది వరకు హాజరయ్యారు. ఈ మీటింగ్‌కు చీఫ్ గెస్ట్‌గా సిద్ధార్థ్‌నాథ్ సింగ్ హాజరై ఎన్నికలకు సంబంధించి బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు.
ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేసుకునేలా ట్రైనింగ్ ఇస్తున్నారు. పోటీ చేయబోయే నియోజకవర్గాలకు ప్రత్యేకంగా కొన్ని టీమ్‌లను ఎంపిక చేయనున్నారు. బీజేపీలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న సీనియర్లకు, నియోజకవర్గంపై పట్టున్న లీడర్లకు ప్రచార బాధ్యతలు అప్పగించనున్నారు.
ఇక వచ్చే నెల 5 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ప్రచారాన్ని చేపట్టనుంది. ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి ఎంపీగా బరిలోకి దిగుతున్న రాజమండ్రి నుంచే ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. పార్టీ జాతీయ నాయకులు, కేంద్ర మంత్రులు ప్రచారసభల్లో పాల్గొనేలా టూర్ షెడ్యూల్స్‌ను ఖరారు చేస్తున్నారు. వీటితో పాటు బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు కలిపి ఉమ్మడి బహిరంగ సభలు కూడా ఎక్కడెక్కడ నిర్వహించాలనే దానిపై ఆలోచన చేస్తున్నారు.
ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేలా బీఆర్ఎస్ పొలంబాట కార్యాచరణ