సభలో జరిగిన పరిణామాలు బాధ కలిగించాయి..బీజేపీ నేత సోము వీర్రాజు

రూల్స్ కి వ్యతిరేకంగా శాసనమండలి చైర్మన్ షరీఫ్ వ్యవహరించారని బీజేపీ నాయకుడు సోము వీర్రాజు అన్నారు. మండలి చైర్మన్ స్థానం అనేది ఒత్తిడికి తలొగ్గకూడదన్నారు. ఒత్తిడికి ఎందుకు లొంగారో చైర్మనే చెప్పాలన్నారు. సభలో జరిగిన పరిణామాలు బాధ కలిగించాయన్నారు. తప్పు చేశానని చైర్మనే అంగీకరించార్ననారు. అధికారపక్షం కూడా సంయమనంతో వ్యవహరించాలన్నారు.
అధికార వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులను..తనకున్న విచక్షణాధికారంతో సెలక్ట్ కమిటీకి పంపుతూ మండలి చైర్మన్ షరీఫ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో మరో మూడు నెలలు రాజధానుల అంశం పెండింగ్‌లో పడినట్లే. శాసనమండలి చైర్మన్ తీరుని వైసీపీ మంత్రులు,ఎమ్మెల్సీలు తప్పుబట్టారు. ఏపీ శాసనమండలికి ఈ రోజు బ్లాక్ డే,మాయని మచ్చ అని మంత్రి బోత్స సత్యనారాయణ అన్నారు. ఇలాంటి వాళ్లు చైర్మన్ గా ఉంటే రాజ్యాంగానికి ఇబ్బంది అని అన్నారు. బిల్లుల ఆమోదం ఆలస్యం చేయవచ్చు కానీ ఆపలేరన్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నవారు పార్టీలకతీతంగా నడుచుకోవాలన్నారు. ప్రభుత్వానికి కూడా విచక్షణాధికారం ఉంటుందని గుర్తుపెట్టుకోవాలన్నారు.