పవన్ మద్దతుతో తిరుపతిలో గెలుపు మాదే, విశాఖ స్టీల్ ప్లాంట్‌ను రక్షించేది మేమే

పవన్ మద్దతుతో తిరుపతిలో గెలుపు మాదే, విశాఖ స్టీల్ ప్లాంట్‌ను రక్షించేది మేమే

Updated On : March 13, 2021 / 12:51 PM IST

bjp mlc madhav on tirupati bypoll, visakha steel plant: జనసేన మద్దతుతో తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఆ పార్టీ ఎమ్మెల్సీ మాధవ్. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమంపైనా ఆయన స్పందించారు. స్టీల్ ప్లాంట్ పై కేంద్రం విధానపరమైన నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఈ విషయంలో ఉద్యోగులు భయపడాల్సింది ఏమీ లేదన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను రక్షించేది బీజేపీనే అని మాధవ్ స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ అంశంలో అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లేందుకు సీఎం జగన్ చేస్తున్న యత్నాలను స్వాగతిస్తున్నామని మాధవ్ చెప్పారు.

”తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో బీజేపీ పోటీ చేయడం శుభపరిణామం. జనసేన మద్దతుతో తిరుపతిలో పాగా వేస్తాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ను రక్షించేది బీజేపీనే. విశాఖ స్టీల్ ప్లాంట్ సామర్థ్యాన్ని పెంచాలని కేంద్రం ఆలోచిస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఆందోళన చెందొద్దు”-మాధవ్.