BJP Chief Purandheswari : చంద్రబాబుకు బెయిల్ రావడాన్ని స్వాగతిస్తున్నాం : పురందేశ్వరి
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయటంపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి స్పందించారు. చంద్రబాబుకు బెయిల్ రావడాన్ని స్వాగతిస్తున్నామన్నారు.

Purandheswar ..Chandrababu bail
Purandeshwari Reacts On Chandrababus Bail : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయటంపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి స్పందించారు. ఈ విషయంపై విజయవాడలో ఆమె మాట్లాడుతు…చంద్రబాబుకు బెయిల్ రావడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన తీరును తాము తప్పుపట్టామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. నోటీసులివ్వకుండా.. విచారణ జరపకుండా అరెస్ట్ చేసిన విధానాన్ని మేం గతంలోనే తప్పు పట్టామని అన్నారు. ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండానే అరెస్ట్ చేసిన విధానం కూడా కరెక్ట్ కాదన్నారు. ఈ క్రమంలో చంద్రబాబుకు మధ్యంతరం బెయిల్ రావడం మంచిదే అన్నారు.
ఈ సందర్భంగా పురందేశ్వరి మరోసారి వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఏపీలో ఇసుక దోపిడీపై ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. కోట్లాది రూపాయల మేర ఇసుక దోపిడీ జరిగిందని ఆరోపించారు.ప్రజా సమస్యలని ప్రస్తావించడం మా బాధ్యత అని అదే మా ప్రధాన అజెండా అని అన్నారు.ప్రభుత్వంలో అవినీతి జరుగుతోందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.నేను స్థానిక అంశాలను ప్రస్తావిస్తోంటే.. నాపై విమర్శలు చేస్తున్నారని ఇది సరికాదన్నారు. ఏపీలో ఇసుక దోపిడీ జరుగుతోందని..గతంలో ట్రాక్టర్ ఇసుక రూ. 100లకు లభించేది. కానీ ఇప్పుడు రూ.5-6 వేలు పెట్టి కొందామన్ని దొరకటంలేదన్నారు. ఇదంతా ఇసుకమాఫియా చేసే దగాలే కారణమని ఆరోపించారు.
Also Read : చంద్రబాబుకు బిగ్ రిలీఫ్.. 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
ఇసుక ధరలు పెరగడం వల్ల సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని..ఇసుక ధర పెరగడంతో నిర్మాణ రంగం కుదేలైందన్నారు.ఇసుక మాఫియా వల్ల సుమారు 35 లక్షల మంది ఉన్న భవన నిర్మాణ కార్మికులు పనులు లభించక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇసుక పాలసీని మార్చి.. ఒకే కాంట్రాక్టరుకు ఇచ్చారని..ఎవ్వర్నీ పోటీకి రానివ్వకుండా జేపీ వెంచర్సుకు కట్టబెట్టారని విమర్శించారు.సబ్ లీజ్ ఇవ్వకూడదనే నిబంధన ఉంది.. కానీ దాన్ని ఉల్లంఘించారని విమర్శించారు.శేఖర్ రెడ్డికి సంబంధించిన టర్న్ కీ ఎంటర్ ప్రైజెసుకు జేపీ వెంచర్స్ సంస్థ సబ్ లీజుకు ఇచ్చిందని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.
సబ్ లీజ్ తీసుకున్న టర్న్ కీ సంస్థను పంపేసి.. కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు అనధికారికంగా కట్టబెట్టారని విమర్శలు సంధించారు.జిల్లాల వారీగా ఇసుక రీచులను అమ్మేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు.ఇసుక దోపిడీలో భాగంగా తాడేపల్లి ప్యాలెస్సుకు రూ. 2 వేల కోట్లు వెళ్లాయి అంటూ సంచలన విమర్శలు చేశారు.హైదరాబాదులోని సుధాకర్ అనే వ్యక్తి ఈ ఇసుక దందాను పర్యవేక్షిస్తున్నారని..ఇసుక దోపిడీకి ఓ ఐఏఎస్ అధికారి సహకరిస్తున్నట్టు మాకున్న సమాచారం అందింది అని తెలిపారు.
Also Read : Ambati Rambabu : చంద్రబాబుకు బెయిల్ రావటంపై మంత్రి అంబటి రాంబాబు ఏమన్నారంటే?
జేపీ వెంచర్స్ సంస్థతో ఒప్పందం ముగిసిన తర్వాత కూడా ఇంకా ఇసుక తవ్వకాలు జరుపుతున్నరని..అనధికారికంగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు అంటూ మండిపడ్డారు.బిల్లులలో ఉండే లెక్కలకూ.. జరుపుతోన్న తవ్వకాలకు ఎక్కడా పొంతనలేదన్నారు.భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరపకూడదనే నిబంధనలున్నా.. కానీ దాన్ని ఉల్లంఘించి ఇష్టానుసారంగా తవ్వేస్తున్నారని విమర్శించారు.నదీ గర్భంలో తవ్వకాలు జరపకూడదనే నిబంధనలున్నా.. రోడ్లు వేసి మరీ డీప్ డ్రెడ్జింగ్ చేసేస్తున్నారన్నారు.వర్షాకాలంలో ఇసుక తవ్వకూడదనే నిబంధలున్నాయనే విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. కానీ ఆ నిబంధనల్ని కూడా ఉల్లంఘించి ఇసుక అక్రమ రవాణాలకు పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు.పరిధిని మించి తవ్వకాలు యధేచ్ఛగా జరుగుతున్నాయన్నారు.
చంద్రబాబుకు బెయిల్ పై స్పందించిన ఆమె తాజాగా చంద్రబాబుపై నమోదైన మద్యం కేసుపై ప్రత్యేకించి స్పందించడానికి ఏమీ లేదు అన్నారు. కేసు నమోదు చేశారు.. దర్యాప్తు జరుగుతోందది దీనిపై తాను మాట్లాడనన్నారు.కొన్ని మద్యం కంపెనీలకు గత ప్రభుత్వమే అక్రమంగా లైసెన్సులిచ్చిందని కేసు నమోదు చేశారని..గత ప్రభుత్వం అనుమతులిచ్చిన కంపెనీల్లో వైసీపీ ప్రభుత్వంలోని పెద్దలు కొందరు ఆ కంపెనీలపై ఒత్తిడి తెచ్చి మద్యం ఉత్పత్తి చేస్తున్నారు అంటూ ఆరోపించారు.