BJP Core Committee : టీడీపీ తో కలిసే ప్రసక్తే లేదు : బీజేపీ నేత మాధవ్

భారతీయ జనతా పార్టీ ఏపీలో టీడీపీ తో కలిసి పనిచేసే ప్రసక్తే లేదని ఆపార్టీ నేత మాధవ్ స్పష్టం చేశారు.

BJP Core Committee : టీడీపీ తో కలిసే ప్రసక్తే లేదు : బీజేపీ నేత మాధవ్

Bjp Will Not Alliance With Tdp

Updated On : June 13, 2021 / 7:44 PM IST

BJP Core Committee : భారతీయ జనతా పార్టీ ఏపీలో టీడీపీ తో కలిసి పనిచేసే ప్రసక్తే లేదని ఆపార్టీ నేత మాధవ్ స్పష్టం చేశారు. విజయవాడలో ఈ రోజు జరిగిన బీజేపీ కోర్ కమిటీ సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ …. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్ధితులపై చర్చించామని… ఏపీని వైసీపీ దివాళా తీయించిందని ఆరోపించారు.

బిల్డ్ ఏపీ పేరుతో ఆస్తుల్ని తనాఖా పెట్టటం సరికాదని ఆయన అన్నారు. ఈనెల 28న వర్చువల్ లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అడ్డదారిలో ఆస్తి పన్ను పెంచటం సిగ్గుచేటని మాధవ్ అన్నారు. ఆస్తి పన్ను పెంపుపై జనసేన పార్టీతో కలిసి బీజేపీ రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపడుతుందని ఆయన చెప్పారు.