Boat Accident: నంద్యాల జిల్లా అవుకు జలాశయంలో పడవ బోల్తా.. ఒకరు మృతి.. ఇద్దరు గల్లంతు

నంద్యాల జిల్లా అవుకు జలాశయంలో ప్రమాదం చోటు చేసుకుంది. జలాశయంలో పర్యాటకులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది.

Boat Accident: నంద్యాల జిల్లా అవుకు జలాశయంలో పడవ బోల్తా.. ఒకరు మృతి.. ఇద్దరు గల్లంతు

Boat Accident

Updated On : May 14, 2023 / 1:36 PM IST

Boat Accident: నంద్యాల జిల్లాలో అవుకు జలాశయంలో ప్రమాదం చోటు చేసుకుంది. జలాశయంలో పర్యాటకులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 11మంది గల్లంతయ్యారు. వెంటనే స్థానికులు అప్రమత్తమై ఎనిమిది మందిని కాపాడారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, ఈ గాలింపు చర్యల్లో ఒక మృతదేహాన్ని గజ ఈతగాళ్లు గుర్తించారు. గల్లంతయిన మరో ఇద్దరికోసం గాలింపు కొనసాగుతోంది.

Women fighting on the road : నడిరోడ్డుపై లేడీస్ బ్యాచ్ ఫైటింగ్.. కంట్రోల్ చేయడానికి ఆ పోలీస్ ఏం చేశాడంటే?

పడవలో ప్రయాణిస్తున్న వారంతా కానిస్టేబుల్ కుటుంబానికి చెందిన వారుగా తెలిసింది. ఆదివారం సెలవురోజు కావడంతో కోవెలకుంట్ల పోలీస్ స్టేషన్‌లో స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ రసూల్ కుటుంబం విహార యాత్రకు వెళ్లింది. ఫ్యామిలీ బోటులో వీరంతా ప్రయాణిస్తుండగా దురదృష్టవశాత్తూ ప్రమాదం జరిగినట్లు సమాచారం.

 

ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో పర్యాటకులు జలాశయం వద్దకు వచ్చారు. అయితే, ఈ అవుల జలాశయంలో బోటు షికారును రెండేళ్ల కిందటే ప్రారంభించారు. గతంలో ఇలాంటి ప్రమాదాలు జరిగిన దాఖలాలు లేవని స్థానికులు పేర్కొన్నారు. అయితే, ఒక్కసారిగా నీరు బోటు లోపలికి రావడంతో బోటు బోల్తా పడినట్లు తెలిసింది. ఈ ప్రమాదంలో గల్లంతయ్యి కాపాడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఓ మహిళ, ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.