Bonda Umamaheshwarrao: రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం, నాటుసారా, అక్రమ రవాణా: బోండా ఉమా

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి..దశల వారిగా మద్యాన్ని నియంత్రిస్తానని చెప్పారని.. కానీ ఇప్పుడు వైసీపీ నేతలే రాష్ట్రంలో కల్తీసారా తయారు చేస్తూ విక్రయిస్తున్నారని బోండా ఉమా ఆరోపించారు

Bonda Umamaheshwarrao: రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం, నాటుసారా, అక్రమ రవాణా: బోండా ఉమా

Uma

Updated On : March 18, 2022 / 7:16 PM IST

Bonda Umamaheshwarrao: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఇటీవల సంభవించిన కల్తీసారా మరణాలపై అధికార ప్రతిపక్షాల మధ్య విమర్శల పర్వం కొనసాగుతుంది. ఈ ఘటనపై టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు శుక్రవారం స్పందించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం కల్తీసారా మరణాలపై వైసీపీ ప్రభుత్వం భాద్యత వహించాలని డిమాండ్ చేశారు. ఒక్క అవకాశం అంటూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి..దశల వారిగా మద్యాన్ని నియంత్రిస్తానని చెప్పారని.. కానీ ఇప్పుడు వైసీపీ నేతలే రాష్ట్రంలో కల్తీసారా తయారు చేస్తూ విక్రయిస్తున్నారని బోండా ఉమా ఆరోపించారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం, నాటుసారా, అక్రమ రవాణా సాగుతున్నాయని.. ఈ విషయాన్నీ టీడీపీ పలుమార్లు ప్రభుత్వ దృష్టికి వెళ్లినా పట్టించుకోలేదని మండిపడ్డారు.

Also read: Chinna Jeeyar Swamy: 20 ఏళ్ల క్రితం చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారు.. అది మా అభిమతం కానే కాదు: చిన్నజీయర్ స్వామి

వైసీపీ సొంత పార్టీ నాయకులే అక్రమంగా సారాయి విక్రయిస్తున్నారని బోండా ఉమా ఆరోపించారు. జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా సేవించి అనేకమంది చనిపోయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని… ఇప్పటి వరకు ఎక్సైజ్ శాఖ మంత్రి బాధిత కుటుంబాలను కనీసం పరామర్శించలేదని బోండా ఉమా విమర్శించారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకి చెందిన మద్యం షాపులో కల్తీమద్యం సేవించి ఏడుగురు చనిపోయారని..ఇప్పటికీ ఆ కేసులో ఎమ్మెల్యే మల్లాది విష్ణు కోర్టు చుట్టు తిరుగుతన్నారని ఉమా అన్నారు. కల్తీసారా, మద్యం అమ్మకాలపై టీడీపీ అధిష్టానం పిలుపు మేరకు శనివారం నుండి రెండు రోజుల పాటు అన్ని నియోజకవర్గాలలో ఆందోళనలు చేస్తున్నట్లు బోండా ఉమా పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాని హెచ్చరించారు.

Also read: Holi: నిన్న గెలిచాం యూపీ .. నేడు గెలుస్తాం ఏపీ..!