Botsa Satyanarayana: వాళ్లు అమిత్ షాని కలిస్తే ఏంటి? అమితాబ్ బచ్చన్‌ని కలిస్తే ఏంటి? జరిగేది ఇదే..: మంత్రి బొత్స

టీడీపీ-జనసేన మధ్య జరిగిన సీట్ల సర్దుబాట్ల విషయం తమకు అనవసరమని బొత్స సత్యనారాయణ అన్నారు.

Botsa Satyanarayana: వాళ్లు అమిత్ షాని కలిస్తే ఏంటి? అమితాబ్ బచ్చన్‌ని కలిస్తే ఏంటి? జరిగేది ఇదే..: మంత్రి బొత్స

Minister Botsa Satyanarayana

Updated On : February 25, 2024 / 3:04 PM IST

టీడీపీ-జనసేన పార్టీలు ఢిల్లీలో అమిత్ షాని కలిసినా, అమితాబ్ బచ్చన్‌ని కలిసినా తమకు సంబంధం లేదని ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఎన్నికలు అయ్యేవరకు అలా కలుస్తూనే ఉంటారని చెప్పారు. వారికి విధి విధానాలు ఏమీ లేవని తెలిపారు. మళ్లీ దోచుకు తినడానికి ప్రయత్నిస్తున్నారని, జగన్‌ను ఓడిస్తామంటూ చెప్పుకొస్తున్నారని అన్నారు.

టీడీపీ-జనసేన మధ్య జరిగిన సీట్ల సర్దుబాట్ల విషయం తమకు అనవసరమని బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వాళ్లకి అజెండా ఏమీ లేదని చెప్పారు. తాము చేసిన అభివృద్ధి, సంక్షేమం చూసి ఓటేయాలన్న అజెండాతో వైసీపీ ముందుకు వెళ్తుందని చెప్పారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రజలకు ఏం చేశారని వారు ఓట్లు అడుగుతారని బొత్స సత్యనారాయణ నిలదీశారు. గతంలో వారు చేసిన మోసాలను చూసి ఓట్లు వేయాలని ప్రజలను అడుగుతారా అని ప్రశ్నించారు. జనసేనకు కేవలం 24 సీట్లు ఇచ్చారంటే ఆ పార్టీ నాయకుడికి ప్రజల్లో ఎంత విలువ ఉందో అర్థమవుతుందని అన్నారు. జనసేన పార్టీ తమకు అవసరమా? అన్న అంశాన్ని ప్రజలే తేల్చుతారని చెప్పారు.

Read Also: లాస్య నందిత కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్