Corona Dead Bodies : కరోనా మృతుల నుంచి వైరస్ వ్యాపిస్తుందా? అంత్యక్రియలకు వెళ్లొచ్చా?
కరోనావైరస్‌తో మరణించిన వారి దహన సంస్కారాలకు వెళ్లొచ్చా? కరోనా మృతుల నుంచి వైరస్ వ్యాపిస్తుందా? అన్న సందేహం చాలామందిలోనే ఉంది.

Can Corona Spread The Virus From The Dead Bodies
Corona dead bodies? : కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడు దేశాన్ని వణికిస్తోంది . ఒకరినొకరు పలకరించుకోవాలన్నా భయపడే పరిస్థితిని తీసుకొచ్చింది. అంతెందుకు ఆప్తులు మరణించినా కూడా చివరిచూపు చూసేందుకు వెళ్లడానికి వెనుకాముందు కావాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో మరి కరోనావైరస్‌తో మరణించిన వారి దహన సంస్కారాలకు వెళ్లొచ్చా? కరోనా మృతుల నుంచి వైరస్ వ్యాపిస్తుందా? అన్న సందేహం చాలామందిలోనే ఉంది.
ఈ సందేహాలపై నిమ్స్ నెఫ్రాలజీ విభాగం వైద్యుడు డాక్టర్ శ్రీభూషణ్‌రాజు క్లారిటీ ఇచ్చారు. చనిపోయిన వారి నుంచి వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉండదన్నారు. మృతుల అంత్యక్రియలకు వెళ్లేందుకు భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. దహన సంస్కారాలకు వెళ్లిన సమయంలో అందరూ గుంపులుగా చేరడం వల్ల ఒకరి నుంచి మరొకరికి వైరస్ వ్యాప్తి చెందుతుందన్నారు. అంతే తప్ప చనిపోయిన వ్యక్తుల ద్వారా వైరస్ వ్యాప్తి జరగదని శ్రీభూషణ్ రావు స్పష్టం చేశారు.
ఒక వ్యక్తి దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు వచ్చే తుంపిర్ల ద్వారా SARS CoV-2 వ్యాప్తి చెందుతుంది. అయితే మృతదేహాల్లోనూ సలైవా, కఫం వంటి ద్రవాలు ఉంటాయి. అయితే మృతదేహాన్ని పట్టుకొని లేదా మీద పడి ఏడ్చినప్పుడు అవి మనకు అంటి వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. అందుకోసమే కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించినప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎవరినీ అనుమతించడం లేదు. అని గతంలో ఒక ఇంగ్లిష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోల్‌కతాకు చెందిన పరమాణు జీవశాస్త్రవేత్త అన్బిరన్ మిత్రా పేర్కొన్నారు.