మాజీ మంత్రి కొడాలి నానికి బిగ్ షాక్.. మరో కేసు నమోదు.. విచారణకు రావాలంటూ పోలీసుల నోటీసులు
: మాజీ మంత్రి కొడాలి నానికి ఊహించని షాక్ తగిలింది. ఆయనపై మరో కేసు నమోదు అయింది.

Kodali Nani
Kodali Nani: మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నానికి బిగ్ షాక్ తగిలింది. ఆయనపై మరో కేసు నమోదు అయింది. సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యులపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడంతోపాటు.. వారిని కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ.. 2024లో విశాఖపట్టణం త్రీటౌన్ పోలీసులకు అంజన ప్రియ అనే యువతి ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు కొడాలి నానిపై U/S353(2), 352, 351(4), 196(1) BNS 467, IT Act కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఆదివారం కృష్ణా జిల్లా గుడివాడలోని కొడాలి నాని ఇంటికి వెళ్లిన పోలీసులు.. విచారణకు రావాలని 41 సీఆర్‌పీసీ నోటీసులు ఇచ్చారు.