అసెంబ్లీలో సీఎం జగన్ : బాబు పాలనలో..అత్యాచారాలు..వేధింపులు లెక్కలు

  • Published By: madhu ,Published On : December 9, 2019 / 09:18 AM IST
అసెంబ్లీలో సీఎం జగన్ : బాబు పాలనలో..అత్యాచారాలు..వేధింపులు లెక్కలు

Updated On : December 9, 2019 / 9:18 AM IST

బాబు పాలనలో వేల సంఖ్యలో అత్యాచార ఘటనలు, వేధింపులు నమోదయ్యాయని అన్నారు సీఎం జగన్. బాబు సలహాలు ఇవ్వాలని అడిగితే..అలా చేయకుండా విమర్శలు చేస్తారని విమర్శించారు. వేలెత్తి చూపెట్టాలనే ఆరాటం తప్ప ఏమీ లేదన్నారు. చిన్నపిల్లలను కూడా చిదిమేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము అధికారంలోకి వచ్చి ఆరు నెలల కాలమే అయ్యిందని, కానీ తమ హాయాంలో జరుగుతున్న అత్యాచార ఘటనలు, వేధింపులు తనను బాధించాయని సభలో తెలిపారు.

అందుకే మహిళల భద్రతపై ఒక చట్టం తీసుకరావాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందని, ఇందుకు సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరడం జరుగుతోందన్నారు. బాబు హాయాంలో జరిగిన అత్యాచార, వేధింపులు, ఇతరత్రా వాటిపై లెక్కలను చదివి వినిపించారు. 

* 2014-19 కాలంలో డౌరీ మర్డర్స్, హారస్ మెంట్, మర్డర్, డీపీ యాక్టు, రేప్ కేసులు, ఇతరత్రా ఉన్న లెక్కలు..
* 2014లో 13 వేల 549 
* 2015లో 13 వేల 088
* 2016లో 13 వేల 948
* 2017లో 14 వేల 696
* 2018లో 14 వేల 048

అత్యాచార ఘటనలు 
* 2014లో 937
* 2015లో 1014
* 2016లో 969
* 2017లో 1046
* 2018లో 1096 ఘటనలు జరిగాయన్నారు. 

దౌర్జన్య ఘటనలు
* 2014లో 4 వేల 032 
* 2015లో 4 వేల 114
* 2016లో 4 వేల 477
* 2017లో 4 వేల 672
* 2018లో 4 వేల 215 కేసులు నమోదయ్యాయన్నారు. 

ఇద్దరు, ముగ్గురు, నలుగురు భార్యలు వివాహం చేసుకున్న దానిలో కేసులు ఈ విధంగా నమోదయ్యాయని లెక్కలు వివరించారు సీఎం జగన్. 
* 2014లో 216
* 2015లో 264
* 2016లో 240
* 2017లో 262
* 2018లో 195 కేసులు నమోదయ్యాయన్నారు సీఎం జగన్
Read More : ప్రతిపక్ష నేతలు సలహాలివ్వాలి..చేతకాకపోతో కూర్చొవాలి – అంబటి