CBI Raids In TDP Leader House : టీడీపీ మహిళా నేత ఇంట్లో సీబీఐ సోదాలు
ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల సీబీఐ అధికారులు టీడీపీ నేతలపై పడ్డారు. టీడీపీ నేత అయ్యన్నపాత్రుడిని అర్థరాత్రి అరెస్ట్ చేయటం వంటి పరిణామాలపై ఏపీ హీటెక్కింది. వైసీపీ ప్రభుత్వం టీడీపీపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది అంటూ టీడీపీ ఆరోపిస్తోంది. ఈక్రమంలో పెనుగొండలోని మరో టీడీపీ మహిళా నేత ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహించటం ఆసక్తిగా మారింది.

CBI raids in TDP woman leader Savitha In Sathya Sai District Penugonda
CBI raids in TDP woman leader house : ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల సీబీఐ అధికారులు టీడీపీ నేతలపై పడ్డారు. టీడీపీ నేత అయ్యన్నపాత్రుడిని అర్థరాత్రి అరెస్ట్ చేయటం వంటి పరిణామాలపై ఏపీ హీటెక్కింది. వైసీపీ ప్రభుత్వం టీడీపీపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది అంటూ టీడీపీ ఆరోపిస్తోంది. ఈక్రమంలో మరో టీడీపీ నేత ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహించటం జరిగింది.
టీడీపీ ఏపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలను నిర్వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని ఆమె స్వగృహంలో తనిఖీలు కొసాగుతున్నాయి. కర్ణాటకలో నమోదైన ఒక కేసు విషయంలో సీబీఐ సోదాలు చేస్తున్నామని చెబుతున్నా..ఇది మాత్రం టీడీపీని టార్గెట్ చేసిన వైసీపీ ప్రభుత్వం చేస్తున్న కుట్ర అని ఆరోపిస్తోంది టీడీపీ.
స్థానిక పోలీసులకు కూడా సమాచారం ఇవ్వకుండానే సీబీఐ అధికారుల బృందం పెనుకొండకు చేరు సమిత ఇంట్లో సోదాలు చేయటంతో టీడీపీ కక్ష సాధింపు చర్యలని ఆరోపిస్తోంది. ఆమె ఇంట్లోని రికార్డులను, ఇతర లావాదేవీలను అధికారులు పరిశీలిస్తున్నారు. సీబీఐ అధికారుల సోదాలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. కాగా..సవిత భర్త వెంటకేశ్వరరావు కర్ణాటకలో రైల్వే కాంట్రాక్టర్ గా పనిచేస్తున్నారు.ఈ కాంట్రాక్టుల్లో అవినీతికి పాల్పడ్డారని భావించిన బెంగళూరు సీబీఐ సోదాలు నిర్వహిస్తున్నారని సమాచారం. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.