AP Red Zones List : ఏపీలో జిల్లాల వారీగా రెడ్‌జోన్‌లో ఉన్న మండలాలివే

ఏపీలో రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్‌లను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. రెడ్ జోన్ల జాబితాలో కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు జిల్లాలు ఉన్నాయి. ఇక ఆరెంజ్‌ జోన్‌ జిల్లాలుగా తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కడప, అనంతపురం, శ్రీకాకుళం, ప్రకాశం, విశాఖలు ఉన్నాయి.

AP Red Zones List : ఏపీలో జిల్లాల వారీగా రెడ్‌జోన్‌లో ఉన్న మండలాలివే

Central Govt Declares Red Zones List For Ap

Updated On : June 29, 2021 / 11:02 AM IST

AP Red Zones List : ఏపీలో రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్‌లను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. రెడ్ జోన్ల జాబితాలో కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు జిల్లాలు ఉన్నాయి. ఇక ఆరెంజ్‌ జోన్‌ జిల్లాలుగా తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కడప, అనంతపురం, శ్రీకాకుళం, ప్రకాశం, విశాఖలు ఉన్నాయి. గ్రీన్‌జోన్‌గా విజయనగరం జిల్లా మాత్రమే ఉంది.

అయితే, రెడ్ జోన్‌లో ఉన్న జిల్లాలో మొత్తం అంతా కూడా కరోనా లేదు. కొన్ని మండలాల్లోనే కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. ఇక ఆరెంజ్ జోన్‌లో ఉన్న జిల్లాల్లో కొన్ని మండలాలు రెడ్ జోన్‌లో ఉన్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలోని ఏ జిల్లాలో ఏ మండలాలు రెడ్ జోన్‌లో ఉన్నాయో ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 97 మండలాలు రెడ్ జోన్‌లో ఉన్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

కర్నూలు జిల్లాలో రెడ్ జోన్ లో ఉన్న మండలాలు (17) : కర్నూలు (పట్టణ), నంద్యాల, బనగానపల్లి గ్రామీణ, పాణ్యం గ్రామీణ, ఆత్మకూరు (పట్టణ), నందికొట్కూరు (పట్టణ), కోడుమూరు, శిరువెళ్ల, చాగలమర్రి, బేతంచెర్ల, గడివేముల, గూడూరు (పట్టణ), ఓర్వకల్లు, అవుకు, పెద్దకడుబూరు, ఉయ్యాలవాడ, ఎమ్మిగనూరు (పట్టణ)

నెల్లూరు జిల్లాలో రెడ్ జోన్ లో ఉన్న మండలాలు (14): నెల్లూరు (పట్టణ), నాయుడుపేట (పట్టణ), వాకాడు, తడ, అల్లూరు, ఇందుకూరుపేట, బాలాయపల్లె, బోగోలు, బుచ్చిరెడ్డిపాళెం.

గుంటూరు జిల్లాలో రెడ్ జోన్ లో ఉన్న మండలాలు (12): గుంటూరు (పట్టణ), నరసరావుపేట, మాచర్ల (పట్టణ), అచ్చంపేట గ్రామీణ, మంగళగిరి (పట్టణ), పొన్నూరు (పట్టణ), చేబ్రోలు, దాచేపల్లి, కారంపూడి, క్రోసూరు, మేడికొండూరు, తాడేపల్లి (పట్టణ)

ప్రకాశం జిల్లాలో రెడ్ జోన్ లో ఉన్న మండలాలు (9): ఒంగోలు (పట్టణ), చీరాల (పట్టణ), కారంచేడు, కందుకూరు (పట్టణ), గుడ్లూరు, కనిగిరి (పట్టణ), కొరిసపాడు, మార్కాపురం (పట్టణ), పొదిలి

తూర్పుగోదావరి జిల్లాలో రెడ్ జోన్ లో ఉన్న మండలాలు (8): శంఖవరం గ్రామీణ, కొత్తపేట, కాకినాడ గ్రామీణ, పిఠాపురం (పట్టణ), రాజమండ్రి (పట్టణ), అడ్డతీగల, పెద్దాపురం (పట్టణ), రాజమహేంద్రవరం గ్రామీణ

పశ్చిమగోదావరి జిల్లాలో రెడ్ జోన్ లో ఉన్న మండలాలు (9): ఏలూరు (పట్టణ), పెనుగొండ గ్రామీణ, భీమవరం (పట్టణ), తాడేపల్లిగూడెం (పట్టణ), ఆకివీడు, భీమడోలు, ఉండి, కొవ్వూరు (పట్టణ), నరసాపురం (పట్టణ)

చిత్తూరు జిల్లాలో రెడ్ జోన్ లో ఉన్న మండలాలు (8): శ్రీకాళహస్తి (పట్టణ), తిరుపతి (పట్టణ), నగరి (పట్టణ), పలమనేరు, రేణిగుంట, నిండ్ర, వడమాలపేట, ఏర్పేడు

కడప జిల్లాలో రెడ్ జోన్ లో ఉన్న మండలాలు (7): ప్రొద్దుటూరు (పట్టణ), కడప (పట్టణ), బద్వేలు (పట్టణ), పులివెందుల (పట్టణ), మైదుకూరు (పట్టణ), వేంపల్లె, ఎర్రగుంట్ల (పట్టణ)

అనంతపురం జిల్లాలో రెడ్ జోన్ లో ఉన్న మండలాలు (5): హిందూపురం (పట్టణ), అనంతపురం (పట్టణ), కళ్యాణదుర్గం, కొత్తచెరువు, సెట్టూరు

కృష్ణా జిల్లాలో రెడ్ జోన్ లో ఉన్న మండలాలు (5): విజయవాడ (పట్టణ), పెనమలూరు గ్రామీణ, జగ్గయ్యపేట (పట్టణ), నూజివీడు (పట్టణ), మచిలీపట్నం (పట్టణ)

విశాఖపట్నంపట్నం జిల్లాలో రెడ్ జోన్ లో ఉన్న మండలాలు (3): విశాఖ (పట్టణ), పద్మనాభం, నర్సీపట్నం (పట్టణ)

రెడ్, ఆరెంజ్ జోన్లు…గ్రీన్ జోన్లుగా ఎప్పుడు మారతాయి:
ఎక్కువ‌ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు ఉండి.. వ్యాప్తి శాతం ఎక్కువగా పెరుగుతున్న ప్రాంతాలను రెడ్ జోన్‌ లేదా హాట్ స్పాట్ గా పిలుస్తారు. పాజిటివ్ కేసులు సంఖ్య‌ తక్కువగా న‌మోదైన‌ ప్రాంతాలను ఆరెంజ్‌ జోన్‌గా ప‌రిగ‌ణిస్తారు. కొద్దికాలంగా పాజిటివ్ కేసులు నమోదు కాని, లేదా ఒక్క పాజిటివ్ కేసు కూడా న‌మోదు కాని ప్రాంతాలను గ్రీన్ జోన్లుగా పిలుస్తారు.(గుంటూరు, కృష్ణాలో భారీగా కరోనా కేసులు, రెండు జిల్లాల మధ్య రాకపోకలు బంద్)

రెడ్ జోన్ అంటే:
ఏప్రిల్ 15 ముందు వరకు 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలను రెడ్ జోన్‌గా ప‌రిగ‌ణించేవారు. తర్వాత దాని ప్రాతిప‌దిక స్థితిగ‌తుల‌ను మార్చారు. రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల్లో 80 శాతం కేసులున్న జిల్లాను రెడ్‌ జోన్‌గా పిలుస్తారు. లేదంటే నాలుగు రోజుల్లో కోవిడ్-19 పాజిటివ్ కేసులు రెట్టింపయిన జిల్లాను రెడ్ జోన్‌గా పరిగణిస్తారు.

ఆరెంజ్ జోన్ అంటే:
ఇక‌ రెడ్ జోన్‌గా ఉన్న ఏరియాలో 14 రోజులపాటు కొత్త కేసులేవీ నమోదు కాకపోతే దాన్ని ఆరెంజ్‌ జోన్‌గా మారుస్తారు. ఆరెంజ్ జోన్‌ లో 14 రోజులపాటు కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాకపోతే దాన్ని గ్రీన్‌జోన్‌గా మారుస్తారు. అంటే రెడ్ జోన్… గ్రీన్‌ జోన్‌గా రూపాంత‌రం చెందాలంటే 28 రోజులపాటు కొత్త పాజిటివ్ కేసులేవీ నమోదు కాకూడదు.

కంటైన్ మెంట్ జోన్ అంటే:
ఇక ఒక నిర్దిష్ట ప్రాంతంలో నాలుగు కంటే ఎక్కువ కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైతే దాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా పిలుస్తారు. ఉదాహరణకు ఏదైనా బిల్డింగ్‌లో నాలుగు కోవిడ్ కేసులు నమోదైతే దాన్ని సీల్ చేస్తారు. దాని చుట్టూ అర కిలోమీటరు మేర ఉన్న ప్రాంతాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా అనౌన్స్ చేస్తారు. కంటైన్‌‌మెంట్ జోన్ చుట్టూ కిలోమీటర్ మేర ఉన్న ప్రాంతాన్ని బఫర్‌ జోన్‌గా పిలుస్తారు. అంటే అక్క‌డ కోవిడ్-19 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌న్న‌మాట‌. కంటైన్‌మెంట్ జోన్‌లో ప్రజల ఇళ్ల నుంచి బయటకు వెళ్లడానికి ఎట్టి ప‌రిస్థితుల్లోనూ అనుమ‌తి ఉండ‌దు. నిత్యావ‌స‌రాలు కూడా అధికారులే ఇళ్ల వ‌ద్ద‌కు అందిస్తారు. బఫర్ జోన్ లో ప్ర‌జ‌ల‌కు పాక్షిక అనుమతులు ఉంటాయి.