Rajahmundry ORR : రాజమండ్రికి ఔటర్ రింగ్ రోడ్ మంజూరు చేసిన కేంద్రం
కేంద్ర ప్రభుత్వం ఏపీకి గుడ్ న్యూస్ చెప్పింది. రాజమండ్రికి ఔటర్ రింగ్ రోడ్డు మంజూరు చేసింది. ఈ మేరకు కేంద్ర ఉపరితల రవాణ శాఖ నుంచి రాజమండ్రి ఎంపీ భరత్ కు..

Rajahmundry Orr
Rajahmundry ORR : కేంద్ర ప్రభుత్వం ఏపీకి గుడ్ న్యూస్ చెప్పింది. రాజమండ్రికి ఔటర్ రింగ్ రోడ్డు మంజూరు చేసింది. ఈ మేరకు కేంద్ర ఉపరితల రవాణ శాఖ నుంచి రాజమండ్రి ఎంపీ భరత్ కు ఉత్తర్వులు అందాయి. రాజమండ్రి చుట్టూ 25 నుంచి 30 కిలోమీటర్ల రింగ్ రోడ్ నిర్మించనున్నారు. దీనిపై ఎంపీ భరత్ స్పందించారు. రాజమండ్రి చరిత్రలో ఇవాళ మరచిపోలేని రోజు అన్నారు.
Covid Booster Dose : కోవిడ్ బూస్టర్ డోసుకు మీరు అర్హులేనా? ఇలా తెలుసుకోండి..!
రాజమండ్రికి రింగ్ రోడ్ సాధించడం గర్వకారణంగా ఉందన్నారు. సుమారు వెయ్యి కోట్ల రూపాయల వ్యయంతో రాజమండ్రి రింగ్ రోడ్ నిర్మాణం చేపడతామన్నారు. మరోవైపు టికెట్ రేట్ల తగ్గింపు వివాదంపైనా ఎంపీ భరత్ స్పందించారు. సంక్రాంతి పండక్కి బెనిఫిట్ షో ల పేరుతో రేట్లు పెంచడానికి ఒక హద్దు ఉండాలని అన్నారు. సంక్షేమ పథకాల కింద ప్రభుత్వం ఇచ్చే డబ్బును టిక్కెట్ల రూపంలో లాగేస్తున్నారని ఎంపీ భరత్ మండిపడ్డారు.